AP: తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యేది కానీ ఇప్పుడు తెలుగు సినిమాల పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా భారీ స్థాయిలో మార్కెటింగ్ ఉందని చెప్పాలి. అయితే ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాల విషయంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి ఈ ఘటన గురించి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎక్కడా కూడా ఏ సినిమాకు బెనిఫిట్ షోలు ఇవ్వనని అదే విధంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచనని ఈయన తెలిపారు. ఇక ఈ విషయంపై సినిమా సెలబ్రిటీలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినప్పటికీ ఆయన మాత్రం తన నిర్ణయంలో వెనకడుగు వేసేది లేదని తెలిపారు. ఇలాంటి తరుణంలోనే తెలుగు చిత్రపరిశ్రమ ఆంధ్రకు వెళ్లి పోతుంది అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఈయన మంగళగిరిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఒకప్పుడు మద్రాసులో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లో హైదరాబాదులో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సినిమా ఇండస్ట్రీకి కావలసిన సదుపాయాలన్నింటిని సమకూర్చడం వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ వచ్చిందని తెలిపారు.
ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉందని తెలిపారు. అమరావతిలో కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే పరోక్షంగా తెలుగు చిత్ర పరిశ్రమ అమరావతికి రమ్మని పిలుపునిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.