AP: పవన్ 11 సీట్లే కదా అని విర్రవీగొద్దు… పవన్ కు కౌంటర్ ఇచ్చిన రాచమల్లు!

AP: ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడవ పర్యటనకు వెళ్లి అక్కడ వైకాపా నేతల గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. వైకాపాకు 11 సీట్లు వచ్చిన అహంకారం నడి నెత్తిన ఉందని వీరికి అహంకారం దించి నేల మీద కూర్చో పెడతాను అంటూ మాట్లాడారు. తోలు తీసి కింద కూర్చో పెడతా జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇలా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైకాపా నాయకులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై చెప్పు చూపించారు. అదే రోజు జగన్ కనుక నీపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలా ఇష్టానుసారంగా మాట్లాడే వాడివి కాదు అంటూ మండిపడ్డారు.

అధికారం అనేది ఏ ఒక్కరికి శాశ్వతం కాదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈరోజు మాకు 11 సీట్లు వచ్చాయని హేళన చేయడం సరికాదని తెలిపారు . 2019 ఎన్నికలలో నీకు కేవలం ఒక సీటు మాత్రమే వచ్చింది. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇలా ఒక్క సీటు వచ్చినటువంటి నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు, 11 సీట్లు వచ్చిన మేము అధికారంలోకి రాలేమా అంటూ ప్రశ్నించారు.

ఇలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తప్పు పడుతూ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ డిప్యూటీ సీఎం తరహాలో కేవలం వైకాపా నాయకుల పై రివెంజ్ తీర్చుకోవడం కోసమే అన్నట్టుగా పాలన సాగుతుందని, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు వైకాపా కార్యకర్తలపై దాడి చేస్తుంటే మాత్రం చోద్యం చూస్తున్నారు అంటూ పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.