AP: ఏపీ గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి లక్షకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఒక్కో గ్రామానికి సుమారు 8 మంది వరకు ఉద్యోగస్తులను నియమించిన సంగతి తెలిసిందే.
ఇలా గ్రామంలో ఉన్నటువంటి వారెవరు కూడా మండల స్థాయి జిల్లా స్థాయి కార్యాల వద్ద ఇబ్బందులు పడుతూ ఉండకూడదన్న ఉద్దేశంతోనే గ్రామ స్వరాజ్యం అంటూ ఈయన ప్రతి ఒక్క గ్రామంలోనూ సచివాలయాలను ఏర్పాటు చేసి ఉద్యోగస్తులను నియమించారు ఇక ఆ గ్రామంలో రైతుల నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి పనులను స్వయంగా సచివాలయంలోనే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు.
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంలో పడింది అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు తాజాగా ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉదయం ఆఫీసుకు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు అటెండెన్స్ వేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు మాత్రం ఉదయం వచ్చినప్పుడు అలాగే సాయంత్రం వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని వెల్లడించారు.
ఇలా ఒక పూట మాత్రమే అటెండెన్స్ వేసి సాయంత్రం వేయకపోతే కనుక ఆరోజు వారికి సెలవుగా పరిగణించబడుతుందని అధికారులు ఇప్పటికే ఉద్యోగస్తులకు సమాచారం అందజేశారు ఇలా అటెండెన్స్ ఆధారంగానే జీతాలను కూడా అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విభిన్న రకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.