పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ప్రత్యర్థులకు పెద్దగా విషయాలు దొరకవు. ఆయన పాలసీల గురించి మాట్లాడితే అపోనెంట్ శ్రేణులు వెకిలి విమర్శలు చేస్తుంటారు. పవన్ అవినీతిపరుడు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం విలువల్ని తాకట్టు పెట్టే మనిషి అంతకంటే కాదు. అందుకే ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితంలోకి దూరుతుంటారు. పవన్ అలా, పవన్ కళ్యాణ్ ఇలా అంటొక్ ఏవేవో మాట్లాడతారు. వ్యక్తిత్వ విధ్వంసానికి దిగుతుంటారు. ఈ పిటికి చేష్టలకు పవన్ ఎన్నడూ భయపడలేదు, బాధపడలేదు. దీంతో వాగిన నోళ్ళన్నీ నొప్పులు పుట్టి మూసుకున్నాయి. అక్కడే వాళ్ళు ఓడిపోయారు.
అయినా వారికి బుద్ది రాలేదు. వ్యక్తిగత విమర్శల స్థాయి నుండి వేషం, రూపం, అలవాట్ల మీద కామెడీ చేసే స్థాయికి దిగజారిపోయారు. పవన్ ఆవేశంగా ప్రసంగిస్తే నవ్వొస్తుందని నవ్వుకునే అల్పసంతోషులకు ఆ ఆవేశం వెనకున్న ఆవేదన కనబడదు. పవన్ చేతిలో పుస్తకం పట్టుకుని కనబడితే ఇంటర్ పాసవ్వలేడు కానీ వీటికేం తక్కువ లేదు అంటూ సంస్కారం లేని కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ అంతర్వేది ఘటన గురించి వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అందులో ఆయన పక్కనే కొన్ని పుస్తకాలున్నాయి. పుస్తకాలు చదివే అలవాటుంది కాబట్టి ఆయన పక్కన, చేతిలో పుస్తకాలే ఉంటాయి. అందులో మామూలు మనుషులకైతే తప్పు కనబడదు. కానీ కొందరు వెకిలి మనుషులకి అదేదో పెద్ద పొరపాటులా కనబడింది.
అలాగే పక్కనే టేబుల్ మీద రాగి నీళ్ల చెంబు ఉంది. అది కూడ కామెడీనే అయింది వాళ్లకు. రాగి చెంబులో నీళ్లు తాగితే సగం రోగాలు దరిచేరవనే విషయం తెలియని అఙ్ఞానులకు అది కామెడీగానే ఉంటుంది మరి. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నారు కాబట్టి గడ్డం ఉంది. అది తెలియకుండా ఆ గడ్డం ఏంటి, కలరేమన్నా వేశాడా అంటూ కామెంట్స్. అసలు ఆ వీడియోలో పవన్ లౌకికవాదం గురించి, హిందూ మతం మీద జరుగుతున్న దాడులను ఎలా చూడాలనే విషయమై చాలా మాట్లాడారు. అవేవీ ఆ వెకిలి వ్యక్తులకు వినబడలేదు. కేవలం పెరిగిన గడ్డం, పక్కన చెంబు మాత్రమే కనిపించాయి. అవే వారిని ఆకట్టుకున్నాయి. అంతేలే.. సామర్థ్యాలను బట్టే విషయాలను చూసే ద్రుష్టి కోణం కూడ ఉంటుంది.