నన్నెవరూ అరెస్ట్ చేయలేరు, నేనసలు జైలుకే వెళ్లలేదు, నన్ను ఎవరూ పీకలేరు, వైఎస్సార్ ఎంతో ట్రై చేసినా నన్నేమీ చేయలేకపోయారు… అని ఇన్నాళ్లూ స్టేలు తెచ్చుకుంటూ పైకి రాజకీయ స్టేట్ మెంట్లు ఇస్తూ సవాళ్లు చేస్తుండేవారు చంద్రబాబు. కానీ మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం అయాన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691 గా ఉన్నారు.
సమస్య రానంతవరకూ ప్రతీఒక్కరూ ఢాంబికాలు పలికేవారే… ఒక్కసారి చురక అంటుకుంటే ఇక పాతవన్నీ గుర్తుకు వస్తాయని చెబుతుంటారు. ఈ క్రమంలో ఇంతకాలం ధైర్యంగా కనిపించిన చంద్రబాబు ఒక్కసారిగా డల్ అయిపోయినట్లు, భయపడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఇకపై తనను బయటకు వదలరేమో అనే సందేహం ఉందని అంటున్నారు.
వీటికి… చంద్రబాబుపై వరుసగా కేసులు విచారణకు వస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్నారు. దీమంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన కేసు ఒకటి లైన్ లో ఉంది. అనంతరం ఏపీ ఫైబర్ నెట్ అనే మాటలూ వినిపిస్తున్నాయి. దీంతో అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబు టెన్షన్ లో పడ్డారని తెలుస్తుంది. దీంతో… వెంటనే బెయిల్ పిటిషన్ వేశారు!
అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు బెయిల్స్ తెచ్చుకున్నారు కానీ.. ఇప్పటివరకూ బాబు లైట్ తీసుకున్నారు.
అవును అంగళ్లు కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు హైకోర్టుకి రాలేదు. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైలుకి వెళ్లడంతో ఆయన అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. దీంతో… అంగళ్లు కేసులో కూడా బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ విచారణ ఈరోజు జరగాల్సి ఉంది.
కాగా… ఆగస్ట్ 4న అంగళ్లులో జరిగిన అల్లర్లలో పలువురు వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు తీవ్ర గాయాలయిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే జరిగినట్టు నిర్థారించిన పోలీసులు ఆయన్ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. మిగతా నిందితుల్ని కూడా ఈ కేసులో చేర్చారు. అయితే… స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన అనుభవమో ఏమో… వెంటనే ఈ కేసులో కూడా బెయిల్ కు అప్లై చేశారు.