తెలుగు రాష్ట్రాలే మోదీ టార్గెట్.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటుతారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు మోదీకి అనుకూలంగా ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మోదీ తన తెలివితేటలతో ఆ రాష్ట్రాలలో కూడా బీజేపీ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

అయితే రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మోదీ టార్గెట్ గా ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అయితే బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రావాలని మోదీ ఆదేశించారని తెలుస్తోంది. ఏపీలో కూడా బీజేపీ కచ్చితంగా పుంజుకోవాలని మోదీ కోరారని సమాచారం. పవన్ మద్దతు ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో పార్టీ పుంజుకోవాల్సిన అవసరం అయితే ఉందని ఆయన ఆదేశించారని సమాచారం అందుతోంది.

అయితే బీజేపీ విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఖర్చు విషయంలో కూడా అస్సలు రాజీ పడకూడదని బీజేపీ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో కనీసం 10 నుంచి 20 స్థానాలలో విజయం సాధించడమే టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ కృషి చేస్తోంది.

2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. బీజేపీ సౌత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గుజరాత్ రాష్ట్రంలో మరోసారి మోదీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం గమనార్హం. గుజరాత్ లో ఆప్ గట్టి పోటీ ఇస్తుందని అందరూ భావించినా పరిస్థితులు మోదీ పార్టీకి అనుకూలంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.