Roja: నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయితే నిన్న గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో వైసిపి నేతలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్లారు అయితే అసెంబ్లీలోకి వెళ్లిన కొంత సేపటికే తమకు ప్రతిపక్ష నేతగా హోదా కల్పించాలి అంటూ డిమాండ్ చేస్తూ గవర్నర్ పోడియం చుట్టుముట్టారు అనంతరం అసెంబ్లీ నుంచి బాయికాట్ అయ్యారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పడంతో కూటమినేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే జగన్ కి ప్రతిపక్ష హోదా కావాలి అంటే జర్మనీకి వెళ్లాలి అంటూ ఆయన మాట్లాడటంతో వైసిపి నేతలు స్పందిస్తూ పవన్ కి కౌంటర్ ఇస్తున్నారు ఈ క్రమంలోనే వైకాపా మాజీ మంత్రి రోజా సైతం స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారు మీకేం చేతనైతే అది చేసుకోండి అని చెప్పారు ఇంతకన్నా ఇంకేం కావాలి. అసెంబ్లీకి వెళ్లడానికి జగనన్న భయపడుతున్నారని చెబుతున్నారు.
జగనన్న భయపడతారా లేక భయపడతారా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగిన తెలుస్తుంది. జగనన్న భయపడతాడా లేదా అనేది సోనియాగాంధీని అడగండి లేదా చంద్రబాబు నాయుడుని అడగండి చెబుతారు. పైకి మేకపోతు గంభీర్యంగా ఉన్నప్పటికీ మనసులో జగన్ భయపడతాడా లేదా భయపెడతాడా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ రోజా తెలిపారు.
జగనన్న ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే, దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సెటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడుకి ఎదురుగా కూర్చుని ప్రశ్నించమని కోరారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కోసం ఎందుకు అంత భయపడుతున్నారు అంటూ రోజా ప్రశ్నించారు. జగనన్నకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేవని తెలిపారు. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గవర్నర్ మీద జగన్ కి గౌరవం ఉన్నందునే అసెంబ్లీకి వచ్చారనీ రోజా తెలిపారు.