గీతం యూనివర్సిటీ కూల్చివేత కార్యానికి అడ్డుకట్ట వేసిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు

Andhra pradesh High Court Stay Order For demolition Works At GITAM University
Andhra pradesh High Court Stay Order For demolition Works At GITAM University
Andhra pradesh High Court Stay Order For demolition Works At GITAM University

విశాఖపట్నం: గీతం విశ్వవిద్యాలయం అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసుపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30వ తేదీ వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

 Andhra pradesh High Court Stay Order For demolition Works At GITAM University
Andhra pradesh High Court Stay Order For demolition Works At GITAM University

టీడీపీ ఎమ్మెల్యే,ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ చైర్మన్‌గా ఉన్న గీతం‌ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 40.51 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలతో జీవీఎంసీ అధికారులు వాటిని కూల్చేశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే భారీగా పోలీసులను మోహరించి.. పొక్లయిన్‌లతో కూల్చివేత పనులు చేపట్టారు. ఆ వెంటనే నిర్ణయించిన హద్దుల వరకు ఫెన్సింగ్‌ వేశారు. ఈ క్రమంలో కొన్ని నిర్మాణాలతో పాటు గీతం వర్సిటీ ప్రధాన ద్వారం, సెక్యూరిటీ గదులు, మైదానం చుట్టూ ప్రహరీ తొలగించారు. ఈ సమయంలో ఏసీపీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్డీవో పెంచల్ కిషోర్‌ ఆధ్వర్యంలో సుమారు 40 మంది రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత పనులు చేపట్టారంటూ గీతం యాజమాన్యం ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే విధించింది.