జగన్ పై తెలంగాణ మంత్రుల అనూహ్య వ్యాఖ్యలు

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి నాయిని నరసింహారెడ్డి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ మహాకూటమిపై పలు విమర్శలు చేసారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ లను దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ పై ఆసక్తికర స్టేట్మెంట్ ప్రకటించారు. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

సోమవారం మీడియా ఎదుట ఏపీకి నెక్స్ట్ సీఎం జగన్ అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి నాయిని నరసింహారెడ్డి. చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీలో ఒకరిద్దరు తన చెంచాలు ఉండాలనే కోరికతోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఒక బచ్చా అని, నోటికొచ్చినట్లు మాట్లాడతాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు. కెసిఆర్ ను తిట్టడానికే రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని ఎద్దేవా చేసారు.

రేవంత్ రెడ్డి భూకబ్జాదారుడని ఆరోపణలు చేసారు నాయిని. ఎన్నికలకు సంబంధించినంత వరకు ఈసీనే సుప్రీమ్ అని పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదనే విషయం తేలిపోయిందని వెల్లడించారు. మర్రి శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పోటీ చేసి నెగ్గాలని ఛాలెంజ్ చేసారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు రోజుల క్రితం మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రాలో టీడీపీ మళ్ళీ రావడం కష్టమే అన్నారు. తెలంగాణలో టీడీపీ మహాకూటమిలో ఉంటే ఆంధ్రాలో గెలవడం కష్టమే అన్నారు. తెలంగాణలో మహా కూటమి కి నిబద్ధత లేదన్నారు. అవకాశవాద పొత్తుల కోసం టిడిపి అరాటపడితే ఆ పార్టీ కి ఏపీ లో ప్రమాదం తప్పదు అన్నారు. అక్కడ వైసీపీ విజయావకాశాలు మెండుగా ఉంటాయన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ