టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన వేస్ట్.. జనసేన నేతల అభిప్రాయమిదే!

ఏపీలో జనసేన పార్టీ గురించి ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 7 శాతం ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో జనసేనకు ఆ స్థాయిలో ఓట్లు రావడం కూడా కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన వేస్ట్ అని జనసేన నేతలే చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజలు సైతం వచ్చే ఎన్నికలను జనసేన సీరియస్ గా తీసుకుంటుందని భావించడం లేదు.

టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన వేస్ట్ అని ప్రజల్లో కూడా భావన కలుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయో లేక సోలోగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ ఎక్కడినుండి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం దొరకడం లేదు. పవన్ పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పవన్ 2024 ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు చాలా విషయాలలో క్లారిటీ ఉండదని ఈ సమస్య వల్లే పవన్ కు ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అటు సొంతంగా పార్టీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంలో ఫెయిలవుతున్నారు.

అదే సమయంలో టీడీపీని బలోపేతం చేయడంలో చంద్రబాబు కూడా ఫెయిలవుతున్నారు. ప్రజల కోసం టీడీపీ, జనసేన ఆలోచించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చెప్పిందే పవన్ ఫాలో అవుతుండటంతో ఆయనను కూడా ప్రజలు నమ్మడం లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.