Ambanti: చంద్రబాబు లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఫైర్ అయిన అంబంటి రాంబాబు!

Ambanti: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కరువయ్యాయి. కేవలం వైసీపీ పార్టీ లేకుండా చేయడం కోసం నేతలు కార్యకర్తలు పై తప్పుడు కేసులు పెడుతూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఈ విషయంలో పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, రెడ్ బుక్ తో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. ఇకపోతే తాజాగా సజ్జల భార్గవరెడ్డి కారు డ్రైవర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అంబంటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి అంబంటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ పై ఫైర్ అయ్యారు.

యామర్తి సుబ్బారావు సజ్జల భార్గవ్ రెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ఈయనపై తప్పుడు కేసులు పెట్టి ఇరికించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.సుబ్బారావును నిన్న ఉదయం మఫ్టీలో పోలీసులు తీసుకెళ్లారు. సజ్జల భార్గవ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ విజయవాడలోని ఓ అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారు. మొహానికి మంకీ క్యాప్ తొడిగి తీసుకెళ్లారు. ఓ గదిలో ఉంచి సుబ్బారావును చిత్రహింసలకు గురి చేసి చివరికి గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ వద్ద వదిలిపెళ్లి పోయారు.

సజ్జల భార్గవ్ ను విచారణ చేయొచ్చు తప్పులేదు. కానీ బ్రతుకు దెరువు కోసం డ్రైవింగ్ చేసుకుంటున్న సుబ్బారావును దారుణంగా కొట్టారు. సుబ్బారావు పై దాడి విషయమై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసామని తెలిపారు. ఇలా డ్రైవర్ సుబ్బారావు పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసులపై కమిషనర్ చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

విచారణకు హాజరుకావాలని న్యాయపరంగా నోటీసులు ఇవ్వడం తప్పు కాదు. మాపై పెట్టిన తప్పుడు కేసుల పై పోరాడుతున్నాం. కానీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నందుకు చంద్రబాబు,రెడ్ బుక్ అధినేత లోకేష్ మూల్యం చెల్లించుకోకతప్పదు అని అంబటి అన్నారు.