పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ప్యాకేజీ కారణమనే అభిప్రాయం పొలిటికల్ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఏ లాభం లేకుండా చంద్రబాబుకు పొలిటికల్ గా బెనిఫిట్ చేకూర్చాలని పవన్ భావించరు. జనసేన లేకుండా ఉండి ఉంటే 2014 సంవత్సరంలోనే వైసీపీకి విజయం నల్లేరుపై నడక అయ్యేదని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అయితే తాజాగా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంబరాల రాంబాబు అంటూ కామెంట్లు చేశారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వీడియో గురించి స్పందిస్తూ సంబరాల రాంబాబు డ్యాన్స్ మహత్తరంగా చేశాడని పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.
ఈ సెటైరికల్ కామెంట్లు తన దృష్టికి రావడంతో అంబటి రాంబాబు కూడా ధీటుగా స్పందించి బదులిచ్చారు. నువ్వు నీ తమ్ముడు చెప్పిన విధంగా నేను సంబరాల రాంబాబునే అని ఆయన అన్నారు. అయితే నేను ముఖానికి రంగు వేయనని ప్యాకేజ్ కోసం డ్యాన్స్ చేయనని అంబటి రాంబాబు కామెంట్లు చేశారు. తనపై విమర్శలు చేసేవాళ్లకు అంబటి రాంబాబు ఘాటుగా జవాబిచ్చారు.
అంబటి రాంబాబు కామెంట్లతో నాగబాబు సైలెంట్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. వైసీపీ నేతలపై కామెంట్లు చేసి మరీ విమర్శల పాలవ్వడం ఎందుకని అంబటికి కొంతమంది సూచనలు చేస్తున్నారు. అంబటి చేసిన కామెంట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.