స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ టీడీపీ పూర్తి డిఫెన్స్ లో పడిపోయిన సంగతి తెలిసిందే. అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని సైడ్ చేసి… అటు కోర్టులోనూ, ఇటు బయటా కూడా అరెస్ట్ చేసిన విదానాన్నే తప్పుపడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యలో వైసీపీ నేతలు వీర దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మైకుల ముందుకు వచ్చారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నెలరోజులు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క తాజాగా చినబాబు లోకేష్ ఇన్నర్ రింగ్ రోండ్ అలైన్ మెంట్ స్కాం కేసులో సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ అరెస్ట్ తప్పదనే విషయంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఈ సమయంలో మైకుల ముందుకు వచ్చారు మంత్రి అంబటి రాంబాబు… ఇందులో భాగంగా… చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు.. నేరం చెయ్యలేదని ఎక్కడా చెప్పడం లేదని.. దొరికిన దొంగకు మర్యాద చెయ్యలేదని మాత్రం వాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోపక్క… అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదని సిమెన్స్ కంపెనీ చెబుతోందని అంబటి చెబుతున్నారు.
ఇదే సమయంలో… చంద్రబాబు జీవితం అంతా స్టేలేనని విమర్శించిన అంబటి రాంబాబు… ఆషామాషీగా చంద్రబాబు అరెస్ట్ జరగలేదని, దొంగలు చాలా సార్లు తప్పించుకుంటారు కానీ అన్ని సార్లు అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇక అటు ఏసీబీ కోర్టు, ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టు… ఇలా అన్ని కోర్టుల్లోనూ చంద్రబాబు న్యాయవాదులు ఒకేతరహా వాదనలు చేస్తున్నారని అన్నారు.
ఇక తాజా హాట్ టాపిక్ గా మారిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసుపైనా స్పందించిన అంబటి… ఆ వ్యవహారంలో లోకేష్ అడ్డంగా బుక్కయ్యారని, ఇన్ని రోజులు లోకేష్ ఢిల్లీ ఓపెన్ జైలులోనే ఉన్నారన్నారు. ఇదే సమయంలో… అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ తప్పించుకోవటం ఆల్ మోస్ట్ అసాధ్యమని మంత్రి అంబటి జోస్యం చెప్పారు. అనంతరం పురందేశ్వరిపై స్పందించారు అంబటి.
ఇందులో భాగంగా… చంద్రబాబును వదిలి వేయమని చెప్పడానికే పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లారని తెలిపిన అంబటి రాంబాబు… అందుకు ప్రతిఫలంగా టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామనే రాయబారం తీసుకెళ్లారని అన్నారు. పవన్ పీకే కాదు.. కేకే (కిరాయి కోటిగాడు) అని విమర్శించారు. పవన్ కాపులను గంపగుత్తగా టీడీపీకి తాకట్టు పెట్టేసారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు పార్టీని కాపాడుకునేందుకే పవన్ పెట్టిన ఆపార్టీ పేరు జనసేన కాదని, బాబు సేన అని ఎద్దేవా చేశారు.