Ambanti: ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల రాంచరణ్ నటించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమాల గురించి మాట్లాడారు అదే విధంగా గత ప్రభుత్వం గురించి కూడా విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హీరో కూడా ప్రభుత్వం వద్దకు వచ్చి చేతులు జోడించి నమస్కారం పెట్టాల్సిన పనిలేదని అలా పెట్టించుకునే లో లెవెల్ మాది కాదు అంటూ మాట్లాడారు.
సినిమా టికెట్లు పెంచుకోవాలి అంటే నిర్మాతలు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడతారు. హీరోలు రావాల్సిన పనిలేదు అంటూ ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి హీరోలు వెళ్లి ఆయనకు నమస్కారాలు పెట్టడం గురించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మా ఎన్డీఏ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతుందని భరోసా కల్పించారు.
ఈ విధంగా ఈ వేడుకలో జగన్మోహన్ రెడ్డి గురించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఈయన సోషల్ మీడియా వేదికగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులపాటు నోరు విప్పకపోవడం మీ స్వభావం అని పవన్ వ్యాఖ్యలకు అంబటి తన ట్వీట్ లో కౌంటర్ ఇచ్చారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఈయన అరెస్టును ఖండిస్తూ అరెస్టు పట్ల స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ అరెస్టు గురించి ఎక్కడ కూడా స్పందించలేదు అయితే చివరికి మీడియా వారి నుంచి ఈయనకు ఈ ప్రశ్న ఎదురు రావడంతో రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ నేను అని ఆయన స్థానంలో నేను ఉన్న అలాగే చేస్తానంటూ చెప్పటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తాజాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు అంబటి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.