అమరావతి స్కామ్.! చంద్రబాబు కొట్టేసిందెంత.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఓ ప్రాజెక్టు మార్చి, అందులో కొన్ని నిర్మాణాల్ని షాపూర్ జీ పల్లం జీ కంపెనీకి అప్పట్లో చంద్రబాబు సర్కారు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే.. చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చుకి సైతం ‘ఓకే’ చెప్పేస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం.

‘వేగంగా రాజధాని ప్రాజెక్టుని పూర్తి చేయడం’ అనే మాట చెప్పి, అమరావతి ముసుగులో అడ్డంగా చంద్రబాబు అండ్ టీమ్ అప్పట్లో దోచేసిందన్న ఆరోపణలున్నాయి. కాగా, ఈ వ్యవహారంలో ఐటీ శాఖ, కీలక విషయాల్ని వెల్లడిస్తూ వస్తోంది. మనోజ్ వి పార్దసాని ద్వారా, చంద్రబాబుకి కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారన్నది ఐటీ శాఖ అనుమానం. జస్ట్ అనుమానం కాదు.. ఆరోపణ.. అంతకు మించి కూడా.!

పలు రకాలైన కోడ్స్ సాయంతో, ‘సీబీఎన్’కి, ‘ఎంవీపీ’ చెల్లింపులు చేశారనీ, దేశంలోని పలు నగరాలతోపాటు, ఇతర దేశాల్లోనూ, ముడుపులు చేతులు మారాయన్నది ఐటీ శాఖ వెల్లడిస్తున్న కీలక విషయాలు.

దాదాపు 118 కోట్ల రూపాయలు ఈ మేరకు చంద్రబాబుకి ముట్టినట్లుగా ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆ మొత్తానికి సంబంధించి లెక్కలు చెప్పాల్సిందిగా, ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల విషయమై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెదవి విప్పడంలేదు.

ఐటీ శాఖ నోటీసులు పంపింది.. వాటికి, చంద్రబాబు సరైన సమాధానం ఇవ్వడంలేదు. ఇరు పక్షాల మధ్యా లేఖల యుద్ధమైతే నడుస్తోంది. కీలక అంశాలు ఒక్కోటీ వెలుగులోకి వస్తుండడంతో, టీడీపీ డిఫెన్స్‌లో పడిపోతోంది. అమరావతి, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు కావాల్సి వుండగా, టీడీపీ నేతలకు ఎప్పుడో ప్రధాన ఆదాయ వనరు అయిపోయిందది.!