కోనసీమకీ తెలంగాణ మంత్రి మల్లారెడ్డికీ లింకేంటి.?

Malla Reddy

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మీద దాడికి యత్నించారు కొందరు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్లారెడ్డి మీద దాడికి యత్నించడమేంటి.? పైగా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ కార్యక్రమంలో ఈ దాడి జరిగింది. అందునా, రెడ్డి సామాజిక వర్గం మరింత వృద్ధిలోకి రావాలని మల్లారెడ్డి ఆకాంక్షించిన సభలోనే ఈ దాడి జరగడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాలోనూ అధికార పార్టీ నేతల ఇళ్ళ మీద దాడి జరిగింది. అందులో ఒకరు మంత్రి, మరొకరు అధికార పార్టీ ఎమ్మెల్యే. దాడి చేసింది కూడా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్.. అంటూ మంత్రి చెప్పడం గమనార్హం. ఇంతకీ, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది.?

దీన్ని ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా రాజకీయ పరిశీలకులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం వుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం వుండి వుండకపోవచ్చన్నది సోకాల్డ్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఏ పార్టీతో ఆయన అసోసియేట్ అయి వుంటే, ఆయా పార్టీలకు చెందిన నేతల మీద దాడులు జరుగుతాయ్. కేజ్రీవాల్, వైఎస్ జగన్, మమతా బెనర్జీ.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే.

కోనసీమ జిల్లా పేరు మార్పు విషయమై ఏ రాజకీయ పార్టీకీ అభ్యంతరాల్లేవు. అయినా, అభ్యంతరాలంటూ దాడులెందుకు జరుగుతాయ్.? మంత్రి మల్లారెడ్డి విషయంలోనూ వివాదానికి ఆస్కారం లేకుండానే దాడి జరిగింది. అదే అసలు లింక్. మరి, తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ విభాగాలు ఈ కేసుల్లో ఎవర్ని దోషులుగా తేల్చుతాయో ఏమో.!