మలేషియాకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకు.. ఆయన ఏమి చేశారు అని అంటారా? వర్చువల్ మీటింగ్ లో షర్ట్ విప్పారు. దీంతో… నిన్న మొన్నటి వరకు అభిమానులుగా ఉన్న నెటిజన్లు సైతం ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తి, ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఇలా చేయడం ఏమిటంటూ ఫైరవుతున్నారు.
మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలో ఆయన షర్ట్ లేకుండా ఉన్నారు. అంతేకాదు.. ఆ సమయంలో ఆయనకు ఒక మహిళ మసాజ్ చేస్తూ కనిపించారు. ఇది… ఆయన సంస్థ అధికారులు, ఉన్నత ఉద్యోగులతో ఆన్ లైన్ మీటింగ్ లో ఉండగా జరిగిన సంఘటన కావడం గమనార్హం.
ఇలా షర్ట్ లేకుండా ఆయన ఒక ఆన్ లైన్ మీటింగ్ కు హాజరవ్వడం.. ఆ సమయంలో ఆయన మసాజ్ చేసుకుంటూ మీటింగ్ కండక్ట్ చేయడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. పైగా… ఆయనకు ఆయనే ఈ ఫోటోను ఆన్ లైన్ లో షేర్ చేసుకుని… బిజీ షెడ్యూల్డ్ వల్ల ఇలా అని చెప్పుకుంటున్నారు! కారణం ఏదైనా అది సరైన పద్దతి కాదంటూ… నెటిజన్లు ఫైరవుతున్నారు.
“ఒక కంపెనీకి సీఈఓగా ఉంటూ.. మేనేజ్మెంట్ మీటింగ్ కు ఇలా షర్ట్ లేకుండా హాజరవ్వడం ఏమాత్రం సభ్యత అనిపించుకోదు… పైగా వెనుక అమ్మాయితో మసాజ్ మరీ టూమచ్” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అనంతరం వెటకారంగా మరికొంతమంది నెటిజన్లు స్పందించారు. ఎంత ఓపెన్ కల్చర్ అయితే మాత్రం ఇంత ఓపేన్ గా మీటింగ్ విత్ మసాజా అంటూ వ్యాఖ్యానించారు.
ఇలా… ఎంత ఓపెన్ కల్చర్ అయితే మాత్రం మరీ ఇంత ఓపెన్ అనుకోలేదని, పిక్ షాకింగ్ అని ఒక నెటిజన్ వెటకారం ఆడగా… లక్కీ ఫెలో అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరైతే పర్సనల్ పనులను పబ్లిక్ లో పెట్టడం ఏంటని కాస్త ఘాటుగానే స్పందించారు. ఎవరు ఏమనుకున్నా ఫెర్నాండెజ్ మాత్రం ఆ పోస్ట్ ను డిలీట్ చేయలేదు. కాకపోతే కొన్ని కామెంట్లను మాత్రం డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.