వీడియో వైరల్: పెన్షన్ ఇబ్బందులు మావల్లే.. పబ్లిక్ గా ఒప్పేసుకున్న టీడీపీ!

ఎన్నికల సమయలో ఏపీలో ఇప్పుడు పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఒకటో తారీఖుకు ఇంటికి పట్టుకెళ్లి పెన్షన్ ఇచ్చేవారు వాలంటీర్లు. అయితే.. ఆ అవకాశం ఇప్పుడు లేదు! దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ.. వృద్ధులూ, వికలాంగులూ ఎవరి పెన్షన్ ను వారే సచివాలయలకు వెళ్లి తెచ్చుకోవాలి! దీంతో… పలువురు వృద్ధులు, వికలాంగులూ ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు అంటూ నిప్పులు కక్కుతున్నారు.

ప్రశాంతంగా సాగిపోతున్న తమ తమ జీవితాల్లో చంద్రబాబు సమస్యలు తెచ్చారంటూ వృద్ధులూ, వికలాంగులూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీసుకి వెళ్లి మరణించిన వృద్ధుల వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. నాడు పుష్కరాల పేరు చెప్పి సామాన్య ప్రజల చావుకి కారణమైన బాబు.. ఇప్పుడు పెన్షన్ పేరు చెప్పి మరోసారి ఆ మరణాలకు కారకుడవుతున్నారని దుయ్యబడుతున్నారు.

అయితే… ఈ విషయంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదు.. ఇదంతా అధికార పార్టీ చేస్తున్న దుష్ప్రచారం.. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఫిర్యాదు వల్లే ఇదంతా జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కావాలనే అధికారపార్టీ పెన్షన్స్ పంపిణీని ఆలస్యం చేస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో… పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయండి (వాలంటీర్లతో కాకుండా) అని సీఎస్ కు టీడీపీ నేతలు లేఖలు ఇవ్వగా.. చంద్రబాబు ఫోన్ చేశారని వార్తలొచ్చాయి!

ఈ సమయంలో… వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్స్ ఇవ్వకుండా అడ్డుకున్నది.. నేడు వృద్ధులు, వికలాంగులూ పడుతున్న బాధలకు కారణం అయ్యింది తామే అని అంగీకరించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు! దీంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఆదిరెడ్డి వాసు… వాలంటీర్లు పెన్షన్ మాత్రమే ఇచ్చి ఆపరని.. ఓట్లు వేయమని కూడా అడుగుతారని.. ఆ సమయంలో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడానికి వెళ్తే వారి వెంట తాము కూడా వెళ్తే.. ఆ క్రమంలో గొడవలు జరిగే అవకాశముందని.. లా అండ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నట్లుగా రిటర్నింగ్ అధికారికి తెలిపామంటుని చెప్పారు వాసు! ఈ సమయంలో డీఎస్పీ కూడా తమ వాదనను సమర్థించాడని అన్నారు!

ఈ విషయాలను తాము చంద్రబాబు, లోకేష్ లకు వెల్లడించామని.. తద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా దీన్ని అడ్డుకున్నామని అన్నారు! దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది! అన్నీ తనకు తెలిసే జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ఇలా నంగనాసి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని.. అది ప్రజలు గ్రహించారని.. ఈ తరహా రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని.. నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు!

దీంతో… నేడు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్స్ ఇంటివద్ద అందకపోవడానికి కారణం.. చంద్రబాబు & కో అనే విషయంపై స్పష్టత వచ్చిందని చెబుతున్నారు వాలంటీర్లు!! తామేదో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేస్తామనే టీడీపీ నేతల భయం.. ఇప్పుడు వారికే కొత్త సమస్యలు తెచ్చిందని చెబుతున్నారు!!