చిన్నచిన్న తప్పులతో పరువు పోగొట్టుకుంటున్న రోజా.. నెటిజన్లు ఏమన్నారంటే?

వైసీపీ ఎమ్మెల్యే రోజా చిన్నచిన్న తప్పులతో పరువు పోగొట్టుకోవడంతో పాటు ప్రజలకు దూరమవుతూ వివాదాలకు దగ్గరవుతున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా ప్రజలను ఆకట్టుకోవడం విషయంలో ఫెయిల్ అవుతున్నారు. చిన్నచిన్న తప్పులతో రోజా పరువు పోగొట్టుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

తాజాగా రోజా గుళ్లు, గోపురాలను సందర్శించి మెడలో దండతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం. మంత్రి కావాలని కలలు కన్న రోజా మంత్రి అయిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో రోజా ఫెయిల్ అవుతున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

రోజా తన పదవిని సరిగ్గా వినియోగించుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ స్థయిలో నష్టపోయే అవకాశం ఉంది. రోజా టీవీ షోలకు కూడా హాజరు కాకుండా ఉంటే మంచిదని ఆ షోలకు హజరు కావడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని మరికొందరు కామెంట్లు చేస్తుండగా ఈ కామెంట్లు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. రోజా ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

సొంత పార్టీ నుంచి వ్యతిరేకత రాకుండా రోజా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా తగ్గుతోంది. విమర్శలను దృష్టిలో ఉంచుకుని రోజా అడుగులు వేయాల్సి ఉంది.