పవన్ కు త్వరలో పెద్ద పరీక్ష…ఏంటో తెలుసా ?

త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో పెద్ద పరీక్షనే ఎదురవ్వబోతోంది. మరి ఆ పరీక్షను ధీటుగా ఎదుర్కొంటారా ? లేకపోతే తన సహజ శైలితో తప్పుకుని వెళ్ళిపోతారా ? అన్నదే ఇంత వరకూ తేలలేదు. ఇంతకీ ఆ పరీక్ష ఏమిటంటారా ? అదినండి శాసనసమండలి ఎన్నికల. వచ్చే మార్చి నెలలలో రెండు క్యాటగిరీలలో ఖాళీ అవబోయే మూడు స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఒక ఉత్తరాంధ్రలో ఉపాధాయ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికల నిర్వహించటానికి ఎన్నికల కమీషన్ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగబోతున్న మూడు ఎన్నికలు కాబట్టి సహజంగానే ప్రధాన్యత వస్తుంది. అందుకనే తెలుగుదేశంపార్టీ, వైసిపిలు మూడు స్ధానాలను గెలుచుకునేందుకు బాగా ప్రిపేర్ అవుతాయని చెప్పటంలో సందేహం లేదు. నిజానికి ఈ మూడు స్ధానాలు గెలుచుకోవటం ఇటు చంద్రబాబునాయుడు, అటు వైస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్ట అనే చెప్పాలి. సరే, పై రెండు పార్టీలకు శాసనమండలి ఎన్నికలు కొత్త కాదు కాబట్టి వాళ్ళ వ్యూహాలేవో వాళ్ళకుంటాయి.

మరి, పవన్ విషయం అలాకాదు కదా ? జనసేన పార్టీని పెట్టి ఐదేళ్ళవుతున్నా ఇంత వరకూ ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనలేదు. నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసుంటే పార్టీ సత్తా ఏంటో తెలిసేది. పోనీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలోనైనా పోటీ చేసిందా అంటే అది లేదు. అప్పుడంటే చంద్రబాబు జేబులో మనిషిగా ఉన్నాడు కాబట్టి పోటీ చేయలేదనే అనుకుందాం. మరి ఇపుడు చంద్రబాబుతో విభేదించారు కదా ? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ స్ధానాల్లోనూ ఒంటిరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు కదా ? మరి తన సత్తా ఏంటో చూపుతారా ?

మార్చిలో జరగబోయే మూడు ఎంఎల్సీ ఎన్నికలంటే మామూలు విషయ కాదు. ఎందుకంటే స్ధానాలు మూడే అయినా ఏడు జిల్లాల్లోని ఓటర్లు పాల్గొనే ఎన్నికలు. నిజానికి ఓటర్లు ఉపాధ్యాయులు, పట్టభద్రులే అయినా వారి ఓటింగ్ సరళిని బట్టి మిగిలిన వర్గాల ఆలోచనలను కొంత వరకూ అంచనా వేయవచ్చు. పైగా పవన్ ఎక్కువగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలపైనే దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల కోటాలో ఒక్కటి, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు పట్టభద్రుల స్ధనాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫైనల్స్ కు రిహార్సిల్స్ లాంటి ఎంఎల్సీ ఎన్నికల్లో పాల్గొంటారా ? లేకపోతే పలయానం చిత్తగిస్తారా అన్నది చూడాలి.