2024లో టీడీపీ జనసేన కూటమి గెలిచినా కష్టమే.. ఆయన సపోర్ట్ ఉండదా? 2

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి పోటీ చేయాలని భావించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో తమ పార్టీ కలిసే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. టీడీపీని నమ్మి గతంలో మోసపోయామని మళ్లీ అలాంటి పొరపాటు చేయాలని అనుకోవడం లేదని వాళ్లు వెల్లడిస్తున్నారు. 2024లో టీడీపీ జనసేన కూటమి గెలిచినా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం ఆ పార్టీకి నష్టమని చెప్పవచ్చు.

అయితే టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పవన్ పరోక్షంగా చెబుతున్నారే తప్ప డైరెక్ట్ గా చెప్పడం లేదు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ సీఎం అవుతారా అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. 2024 ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండటంతో పవన్ సైతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

2024 ఎన్నికల్లో గెలుపు కోసం ఏ అవకాశాన్ని వదులుకోకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్నికల్లో గెలిస్తే పార్టీ పుంజుకుంటుందని అదే సమయంలో పార్టీకి మంచి జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే కావడంతో పాటు సీఎం కావాలని పవన్ అనుకుంటున్నారు. అయితే పవన్ ప్రతిపాదన విషయంలో చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

పవన్ ను సీఎంగా చూడాలని జనసైనికుల ఆకాంక్ష కాగా వాళ్ల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండగా అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం పవన్ కూడా డబ్బు ఖర్చు చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.