సెలెక్ట్ కమిటీలను నిర్ణయించిన మండలి చైర్మన్ !

సెలెక్ట్ కమిటీల విషయంలో ఎపి శాసన మండలి చైర్మన్ షరీఫ్ పంతం నెగ్గించుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకొని అయన గురువారం సెలెక్ట్ కమిటీ లను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, ఏ ఆర్ డీఏ రద్దు బిల్లులను అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీలను నియమిస్తూ ఆదేశాలిచ్చారు. సి ఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. సభ్యులుగా టిడిపి నుండి ఎం ఎల్ సీలు దీపక్ రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వై సిపి నుండి మహ్మద్ ఇక్బల్, పిడిఎఫ్ నుండి వెంకటేశ్వరా రావు, బిజెపి నుండి సోము వీర్రాజు నియమితులయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణ బులు సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా బుగ్గన నియమితులయ్యారు. సభ్యులుగా టిడిపి నుండి నారా లోకేష్, అశోక్ బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి.. తదితరులు నియమితులయ్యారు.

అయ్యితే సెలెక్ట్ కమిటీ రాజ్యాంగ విరుద్ధం అంటూ మండలి చైర్మన్ షరీఫ్ కు వైసిపి లేఖ రాసింది. కమిటీల్లో తాము భాగస్వాములు కాబోమని లేఖలో పేర్కొంది. సెలెక్క్ట్ కమిటీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, మండలి రద్దు బిల్లు సైతం పార్లమెంట్ లో పెండింగ్ లో ఉందని ఇలాంటి సమయంలో పేర్ల ప్రకటన అవసరం లేదంటూ మండలి చైర్మన్ కు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, పిల్లి సుభాష్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లేఖ రాసారు. అయితే కమిటీల ఏర్పాటు పై తన విచక్షణ అధికారాన్ని ఎవరు నియంత్రించ లేరని మండలి చైర్మన్ షరీఫ్ అన్నట్టు తెలిసింది. సెలక్ట్ కమిటీ గడువు బుధవారం ముగిసింది. ఇప్పటికే అయన పార్టీలు సభ్యుల పేర్లను ప్రకటించాయి. మరోవైపు సెలెక్ట్ కమిటీల ఏర్పాటు నిబంధనల ప్రకారం జరగలేదు కాబట్టి చైర్మన్ గా బాధ్యతలు తీసుకోనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. జగన్ సర్కార్ వద్దంటున్నా కూడా మండలి చైర్మన్ పట్టుదలతో సెలెక్ట్ కమిటీలను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.