సిబిఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఈడీ మరోసారి జగన్మోహన్ రెడ్డి కి ఝలక్ ఇచ్చింది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు సిబిఐ కోర్టు అభ్యంతరం తెలిపింది. జగన్ తన బదులుగా జగతి పబ్లికేషన్ ప్రతినిధిని హాజరయ్యేందుకు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ రోజు నాంపల్లి లోని సిబిఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. అయితే ఈ రోజు కోసం జగన్ మినహాయింపు కోరారు .. కానీ కోర్టు దానిని తిరస్కరించింది.

జగన్ తో పాటు ఎంపీ విజయ సాయి రెడ్డి, ఐ ఏ ఎస్ అధికారిణి శ్రీ లక్ష్మి , విశ్రాంత అధికారులు శామ్యూల్, రాజగోపాల్ తదితరులు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ కోర్టు కు వెళ్ళేది ఉండడం వల్లే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటిచారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ పై పలు విమర్శలు గుప్పించారు. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 30 కోట్ల అధిక భారం పడిందని అయన అన్నారు. సిబిఐ కోర్టుకు వెళ్లేందుకే జగన్ ఈ రోజు అసెంబ్లీ కి సెలవు ప్రకటించారని ఆరోపించారు. అవినీతి, అక్రమ కేసుల్లో జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రభుత్వం పై ఏడాదికి 30 కోట్ల వరకు భారం పడుతుందని అయన ఎద్దేవా చేసారు.

సీఎం అవినీతి వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని భరించాలా అని అయన ప్రశ్నించారు. తాజాగా దేవినేని ఉమా మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ సొంత అజెండా అమలు చేస్తున్నారని, ఎంత ప్రయత్నించినా మంత్రి మండలి మాత్రం రద్దు కాదని అయన అన్నారు. మండలి విషయంలో జగన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే కోర్టుకు వెళ్తామన్నారు. ఏపీలో అరాచక పాలనా సాగుతుందని, అక్రమ ఆస్తుల కేసులో ఏ 2 ముద్దాయి విజయ్ సాయిరెడ్డి కి మండలిలో ఎం పని ? అని దేవినేని ఫైర్ అయ్యారు. ఎంఎల్సీలను ప్రలోభ పెట్టేందుకే అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.