వై యస్ భారతి కేసు – ఎవరికేంటి – 1

YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్నా రాజకీయ వేడి దేశం లో మరే రాష్ట్రంలోనూ కనిపించదు . ఇక్కడ జరిగే ప్రతి సంఘటనని రాజకీయాలకి ముడివెయ్యడం, అన్నింటిని ఓట్ల కోణంలో లాభా నష్టాలు భేరీజువేయ్యడం పరిపాటి. ఈ సందర్భంలో వై యస్ భారతి గారి మీద ఈడీ తీసుకున్న తాజా నిర్ణయంతో రాజకీయా పార్టీలకి జరిగే లాభ నష్టాలు చర్చించడం ఈ వ్యాసం ముఖ్యవుద్దేశం.

ఈ కేసు జగన్ మోహన్ రెడ్డి సతీమణి కి సంభందం వుంది కాబట్టి ముందుగా వైస్సార్సీపీ మీద ఈ కేసు ప్రభావం ఎలా వుంటుందొ చూద్దాం. వైస్సార్సీపీ కి అతి పెద్ద బ్యాగేజి జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులు. కేసులు కోర్ట్ పరిధిలో వున్నా వైస్సార్సీపీని విమర్శించాలంటే ప్రత్యర్థులకు మొదటి అస్త్రం ఈ కేసులే . ఈ కేసు లో తమాషా ఏంటంటే 2010 నుండి ఈ కేసులు విచారణలో వున్నా జగన్ దోషి అని గాని నిర్దోషి అని గాని తేలకపోవడం. ఇంకో పది సంవత్సరాలు తెలకపోయినా ఆశ్చర్యం ఏమి లేదు. అప్పటివరకు జగన్ వీటిని భరించాల్సిందే సమాధానం చెప్పుకోవాల్సిందే.

ఈడీ భారతి గారిని నింధుతురాలిగా చేర్చాలనే నిర్ణయం ప్రత్యర్థులకు ఒక కొత్త అస్త్రం కావొచ్చు, టీవీలకి మరింత ముడిసరుకు అందించవచ్చు కానీ వైస్సార్సీపీ కి వచ్చిన నష్టమేమి వుండకపోవొచ్చు. ఎందుకంటే వై యస్ జగన్ మీద ఒక అభిప్రాయం జనాలలో ఈ ఎనిమిద సంవత్సరాల కాలంలో ఏర్పడింది . జగన్ అవినీతిపరుడు అని నమ్మే వాళ్ళు ఒక వర్గం లేదు జగన్ కాంగ్రస్ టీడీపీ రాజకీయాలకి బలైపోయాడు అని నమ్మేవాళ్ళు ఇంకో వర్గంగా జనం ఎప్పుడో విడిపోయారు . ఈ ఈడీ కేసు వల్ల ఎవరి అభిప్రాయాలు మారే ఛాన్స్ లేదు. కాకపోతే టీవీ వాళ్ళ చర్చలకు ఇది ఒక కొత్త సబ్జెక్టు.

నష్టం లేదనడంలో తర్కం ఏంటంటే అధ్యక్షుడే నిందుతుడిగా కోర్టుకి హాజరవుతున్నపుడు దాని వల్ల జరిగే నష్టం కంటే ఇంకెవరినో ఈ కేసు లో కొత్తగా చేరిస్తే వచ్చే నష్టమేమి వుండదు. భారతి సిమెంట్స్ వ్యవహారాల్లో ఏమి చేసిన జగన్ మాత్రమే చేసివుంటారు. చట్ట పరంగా ఎవరి పేరుమీదో లావాదేవీలు జరిగినా అవన్నీ జగన్ ఆదేశానుసారమే జరిగివుంటాయి. అది నీతి అయినా అవినీతి అయినా జగన్ ఖాతా లోకి మాత్రమే వెళుతుంది. కాబట్టి భారతి గారు ఈ కేసు లో వున్నా లేకున్నా వైస్సార్సీపీకి రాజకీయంగా పెద్ద తేడా ఏమి వుండదు.

ఒక వేళ ఎంతో కొంతమంది మారేవారు వున్నా ఈ కేసు వల్ల జగన్ కి కొన్ని ప్రయోజనాలు వున్నాయి. ఇన్నాళ్లు జగన్ కి బీజేపీ కి లంకె పెట్టిన టీడీపీ ఇకమీదట ఆ వాదనను బలంగా వినిపించలేకపోవొచ్చు. ఇది వైస్సార్సీపీ కి కచ్చితంగా కలిసివచ్చే అంశమే. వైస్సార్సీపీ మీద మైనారిటీలకు వున్నా అనుమానాలు చాల వరకు తొలగిపోవొచ్చు.

ఒక కేసులో ఒకరిని నిందుతులుగా చేర్చడానికి ఎనిమిది సంవత్సరాలు కాలం పట్టిందంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఎన్నికల ముగింట్లో ఒక పార్టీ అధినేత సతీమణిని కేసులో చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు జగన్ అండ్ కో ఈ ఆస్తుల కేసులన్నీ రాజకీయ ప్రేరేపితం అనే వాదనకి బలం చేకూర్చే అవకాశం వుంది.

కొత్తగా ఏదో సాక్షాలు దొరికాయి కాబట్టి భారతి గారిని చేర్చివుంటారు అని కొంచం చట్టం తెలిసన వాళ్ళు, తర్కంతో ఆలోచనచేసే వాళ్ళు నమ్మినా , చాల వరకు సామాన్య జనం కేవలం ఆడకూతురి సెంటిమెంట్ తో ఆలోచిస్తే , ఇదేదో కావాలని జగన్ ని ఎదొర్కొవడం కోసం వేసిన ఎత్తుగడగా భావించే అవకాశం వుంది .

ఇవన్ని వైస్సార్సీపీ కి కలిసివచ్చే అంశాలు అయినప్పటికీ, పాదయాత్ర తో ప్రజల మధ్య సుదీర్ఘకాలంగా వుంటూ ప్రజల మద్దతు కూడగట్టే సమయంలో ఇది ఖచ్చితంగా ఒక డీవియేషన్ . తాత్కాలికంగా ఈ విషయం మీద జరిగే చర్చలు కొంచెం చికాకు కలిగించక మానదు. జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన తొలి రోజున మీడియాలో వచ్చిన నల్ల ధనం కథనంలాగా కొన్నిరోజులకి ఇది ప్రాముఖ్యత కోల్పోతుంది. జగన్ మీద అవినీతి కేసులు మాత్రమే ప్రధానంగా వినిపిస్తూవుంటాయి మనం వింటూవుంటాము.

రాజకీయాలు కాసేపు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఇది జగన్ కి ఒక పెద్ద కుదుపు. తాను ఈ కేసులన్నీ ఎదుర్కోవడానికి సిద్దపడే కాంగ్రెస్ ని వ్యతిరేకించి బయటకి వచ్చారు,కానీ అవే కేసులు తన కుటుంబసభ్యులవరకు వస్తాయని ఊహించి వుండరు. మరి ముఖ్యంగా టీడీపీ NDA నుండి బయటకి వచ్చిన తర్వాత ఇలా జారుతుందని జగన్ వూహించని పరిణామం అనే చెప్పాలి. స్వయంగా తననే 16 నెలలు జైల్లో వుంచినా వెరవని వ్యక్తి ఈ పాటి కుదుపుని తట్టుకోలేడా అనేది జగన్ అభిమానుల ధీమా ….

సశేషం….

వై యస్ భారతి కేసు – ఎవరికేంటి – 2