ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం నడుస్తుంది. ఇప్పటికే అమరావతి, కర్నూలు, వైజాగ్ లను మూడు రాజధానులుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా టిడిపి నేత గంట శ్రీనివాస్ రావు వైజాగ్ విషయంలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. గంట మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇంతకీ గంట ఏమన్నాడంటే .. వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే దిశగా అలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసుకుందని విశ్వసిస్తున్నానంటూ టిడిపి నేత గంటా శ్రీనివాస్ రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వాల్తేర్ క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పధం అవలంబిస్తే మంచిది. వైజాగ్ కి ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతొ 1883 లో ప్రారంభం అయినప్పటినుండి ఈ క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైంది, వైజాగ్ బ్రాండ్ లో భాగమైంది అని అయన తెలిపారు.
అందరికి ఆహ్లాదాన్ని, ఆతిధ్యాన్ని ఇచ్చే మన్నికైన ప్రాంతం కావడంతో దీనితో అనుభందం పెరిగింది. ఇందులో ఎందరో విద్యా వేత్తలు, సామజిక వేత్తలు, దేశ భక్తులు , వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన నిపుణులు, దేశ విదేశాల్లో తమ తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు చాలా మంది సభ్యులుగా ఉన్నారు అని చెప్పారు. ఈ సున్నితత్వాన్ని, ప్రజల భావోద్వాగాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దీనికి యధాతదంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని భావిస్తాను అంటూ తెలిపారు గంట. మొత్తానికి గంట చెప్పిన దాంట్లో వైజాగ్ ని క్యాపిటల్ చేయడంలో సపోర్ట్ ఇస్తున్నట్టా .. లేనట్టా అన్నది సందేహంలో ఉంది.