లోకేశ్ అత్యుత్సాహం, కర్నూల్ టిడిపిలో కంపరం

ఐటి మంత్రి లోకేశ్ నాయుడు అత్యుత్సాహంతో చేసిన ప్రకటన ఒకటి కర్నూలు జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. లోకేష్ అంటే టిడిపియే అనే విషయంలో అనుమానం లేదెవరికి, అదే విధంగా ఆయనే చంద్రబాబు వారసుడు అనే విషయంలో కూడా ఎవరికీ సంశయం లేదు. అయితే, ఈ విషయాన్ని అచరణలో పెట్టేందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ చాలా తొందరపడుతున్నారు. అదే చిక్కులు తెచ్చింది.

Butta Renuka SV Mohan Reddy

మూడు రోజుల కిందట కర్నూలు పర్యటనకు వెళ్లిన లోకేశ్ నాయుడు అక్కడ కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీచేస్తారని,  కర్నూలు అసెంబ్లకీ ఎస్వీ సుబ్బారెడ్డి నిలబడతారని ప్రకటించి వాళ్లిద్దరిని మంచిమెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆ ప్రకటనకు ఆ రోజు బాగా చప్పట్లు పడ్డాయి. ఎనిమిది నెలలు ముందుగా అభ్యర్థులను ప్రకటించేంత గుండెలు టిడిపి యువరాజావారికి తప్ప మరెవరికి లేవని కొంతమంది ఈలలు వేశారు. అయితే, ఇది మరొక వైపు చిచ్చు పెట్టింది.

టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ కు ఇది ఏమాత్రం రుచించలేదు. ఇంతముందుగా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి అసంతృప్తి ముందుగా ప్రకటించినందుకు కాదు, ఎస్వీ మోహన్ రెడ్డి పేరును ప్రకటించడం.

TG Bharath

చాలామంది టిడిపి నేతల్లాగే టిజికి ఒక కుమారుడున్నాడు. ఆయన పేరు భరత్. భరత్ ని  తన రాజకీయ వారుసుడిగా చేయాలనుకుంటున్నాడు. ఇది సహజమే. దీనికి కర్నూలు అసెంబ్లీ స్థానం అనువయిందని ఆయన నమ్మకం. ఇలా ఆశించడం తప్పు కాదు.  అందునా  కర్నూలు టిజి ఎంపయిర్. ఎన్నికల నాటికి ఏదో విధంగా పార్టీ బాస్ ను ఒప్పించి ఆయన భరత్ ని 2019 అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నారు. అయితే, టిడిపి మనసులో మరొకటుంది. ‘‘రాయలసీమలో సాధ్యమయినంత మంది రెడ్లను బలపర్చి, రెడ్ల ఓట్లు వైసిపికి పడకుండా చేయాలి. రెడ్డి నాయకులను ఎంకరేజ్ చేయాలి. రెడ్ల ఓట్లను అన్నింటిని కాకపోయినా, కొన్నింటినయినా టిడిపికి లాక్కోవాలి,’’ ఇది టిడిపి వ్యూహం. ఈవ్యూహం అమలుచేసేందుకు లోకేశ్ ఎస్వీమోహన్ రెడ్డిని వాడుకుంటున్నారు. అందుకే ఎస్వీమోహన్ రెడ్డికే టికెట్ అని  టిడిపి వోనర్ స్థాయిలో ప్రకిటించారు.

అయితే, ఒక వేళ టికెట్టివ్వాలని మనుసులో ఉన్నా అది ఇలా ప్రకటించేయడం రాజకీయపార్టీలలో జరగదు. ఎందుకంటే, పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కమిటి వేస్తాయి, ఆ కమిటీ దరఖాస్తులను స్క్రుటినీ చేసి, ఏదో ఒక తతంగం పూర్తి చేసి, పెద్ద ఉత్కంఠ  సృష్టించి చివర్లో అభ్యర్థి పేరును చివరి నిమిషంలో  ప్రకటిస్తారు. ఇలాంటి దేమీ లేకుండా లోకేశ్  ’  నా పార్టీ నా ఇష్టం’అన్నట్లు బుట్టా రేణుక, ఎస్వీమోహన్ రెడ్డి పేర్లను ప్రకటించడం, కొడుకు భవిష్యత్తును ఈస్టుమన్ కలర్ లో వూహించుకుంటున్న టిజి వెంకటేశ్ కు ఇబ్బందయింది. దీనితో ఆయన అసంతృప్తి వోపెన్ గానే వ్యక్తం చేశారు.

TG Venkatesh

 

‘లోకేశ్ పాల్గొనింది ప్రభుత్వ కార్యక్రమం. అక్కడ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. ఎపుడయినా బిఫామ్ ఇచ్చే ముందు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. మరి లోకేశ్ ఇలా ఇంతముందుగా  ఎందుకు ప్రకటించారో అర్థం కావడంలేదు. నారాలోకేశ్ ను ఎస్వీమోహన్ రెడ్డేమయినా హిప్నటైజ్ చేశారేమో ,’అని బాగా వ్యంగ్యంగా వ్యఖ్యానించారు.

అయితే ఇది తుదినిర్ణయం కాదుగా అంటూ, కర్నూలు ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద తుది నిర్ణయం ప్రకటించాక సలు స్పందన ఉంటుందని టిజి అన్నారు.

అయితే, లోకేశ్ ప్రకటనపట్ల ఎస్వీమోహన్ రెడ్డి చాలా ఖుషీగా ఉన్నారు. ఇలా ముందుగా పేర్లు  ప్రకటించడం మంచిదని అన్నారు.  టిజి వెంకటేశ్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చేపుడే 2019 ఎన్నికలలో కర్నూలు అసెంబ్లీ సీటును తనకు కేటాయించారని, అపుడు అది ఖరారయిందని మోహన్ రెడ్డి అన్నారు.

టిడిపి అవసరాలు వేరు, టిజి వెంకటేశ్ అవసరాలువేరు. టిజి వెంకటేశ్ ఆర్యవైశ్య నాయకుడు.  వాళ్ల వోట్లకంటే, రాయలసీమలో రెడ్ల వోట్లు ను లాక్కోవడం టిడిపికి అవసరం. అయినా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టిజి ఏం చేయగలడు. పార్టీ మారే సాహసం చేయగలడా? ఒక వేళ వ్యవూహత్మకంగా వైసిసి కర్నూలు అసెంబ్లీ సీటును భరత్ కు ప్రకటిస్తే… అపుడు కథ మరొక విధంగా ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో?