లాజిక్ మరిచి చంద్రబాబుని విమర్శిస్తున్న వైస్సార్సీపీ!

YSR Congress Party

గత యాభై రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్ర బాబు నాయుడు సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కి దూరంగా తెలంగాణాలో వుంటున్నారు. ఇది అదునుగా చూసుకొని అధికార వైస్సార్సీపీ సభ్యులు చంద్ర బాబు మీద మాటలు దాడి చేస్తున్నారు.

మొన్నటి వరకు కరోనా లాంటి ఆపద సమయంలో రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టించుకోకుండా చంద్ర బాబు తన స్వార్థం చూసుకొని తన కుటుంభంతో సహా హైదరాబాద్ లోని తన రాజప్రాసాదం లాంటి ఇంట్లో దాక్కున్నారని అన్నారు. నిన్నటి నుండి వైజాగ్ లో అంత ప్రమాదం జరిగితే కనీసం ప్రతిపక్ష నేత అక్కడ పర్యటించి బాధితుల్ని పరామర్శించలేదు అని విమర్శించారు.

చంద్ర బాబు హైదరాబాద్ నుండి ఆంధ్ర కు కేవలం తనకు కరోనా సోకుతుందనే భయంతో రాలేదనేది వైస్సార్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రధాన విమర్శ. మరి కొంత మంది నాయకులైతే చంద్ర బాబు కి కరోనా సోకితే అయన వయసురీత్యా ఇంకా అంతే సంగతులు అని మరింత దిగజారుడు విమర్శలు చేస్తున్నారు.

ఇంతకీ చంద్ర బాబు ఎందుకు ఆంధ్ర కి రాలేకపోతున్నారు? ప్రస్తుతమున్న లొక్డౌన్ నిబంధనలు పాటించడం వల్లనే రాలేకపోతున్నారు అని వైఎస్సార్సీపీ నాయకులూ తెలుసుకోలేకపోతున్నారు. ఒక వేళా  వారు చెప్పినట్టు కారొనకి బయపడి చంద్రబాబు రాలేదనుకున్నాం. అంటే ఆంధ్ర ప్రదేశ్ లో మనుషులు బయట తిరగలేనంత దారుణంగా కరోనా పరిస్థి ఉందా. ఒక వేళా ఆలా ఉంటే అది తమ ప్రభత్వ వైఫల్యమే అవుతువుంది కానీ చంద్ర బాబు తప్పు ఎలా అవుతుంది. ఇంత చిన్న లాజిక్ మిస్సయ్యి వైస్సార్సీపీ నేతల విమర్శలు హద్దులు దాటుతున్నాయి.

సందర్భాన్నిబట్టి రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ ఇలాంటి అసందర్భమైన విమర్శలు వల్ల వైస్సార్సీపీ ప్రజల్లో పలుచన అవుతుందే కానీ టీడీపీ కి వచ్చిన నష్టం ఏమి ఉండదు, అలాగే ప్రజలకి ఒరిగే మంచి ఏమి ఉండదు.