మాట మార్చేసిన జగన్… రాజీనామాల్లేవ్… రాజీలే!

మాట తప్పను.. మడవ తిప్పను.. అన్న జగన్ ఇప్పుడు మాట మార్చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన రోజే అనర్హత వేటు పడాలి అని గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఆ మాట సరి చేసుకున్నట్లు వున్నారు. రాజీనామాలు లేవు.. కేవలం రాజీలే అంటున్నారు..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వస్తే మరోలా ఉంటున్నాయి రాజకీయ నేతల మాటలు. ఇప్పుడు తొలి సారి ముఖ్యమంత్రి అయిన జగన్ కూడా ఆ రాజకీయాలనే వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ఏమీ మాట్లాడటం లేదు.. రాజీనామాల ప్రస్తావన తేవడం లేదు. దాంతో తాను పెట్టుకున్న సిద్ధాంతానికి సీఎం స్వయంగా తిలోదకాలు ఇచ్చేసారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ చెంతకు చేరారు. అయితే వారు వైసీపీ తీర్థం పుచ్చుకోరు, వైసీపీ జెండా కప్పుకోరు కానీ.. ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. తమ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర ఎమ్మెల్యేలుగా చలామణి అవుతారు. తొలుత టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇదే పని చేేశారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీకి మద్దతు ఇచ్చారు.. అదే బాటలో ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే కూడా చేరారు. మరో ముగ్గురు కూడా అదే బాటలో ఉన్నారు. మొత్తానికి పార్టీలు మారితే రాజీనామాలు ఉండవు.. అవి కేవలం రాజీలే అన్నమాట.