బలిసిన కోడి అంటూ లోకేష్ పై .. రోజా ఫైర్ ?

 

ఏపీ లో శాశన మండలి రద్దు దిశగా అసెంబ్లీ లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. శాసన మండలి రద్దు ప్రతిపాదనను వైసిపి ప్రభుత్వం తెచ్చిన సమయంలో వైసిపి నేతలు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న రోజా అయితే ప్రతిపక్షాలపై గట్టిగానే ఫైర్ అయింది. టీడీపీ పెద్దల సభను అపహాస్యం చేస్తోందని, చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని మండలి చైర్మన్ ని ఎలా కంట్రోల్ చేసారో అందరు చూసారని అన్నారు. నిజంగా ఇది దురదృష్టకరం, అప్పట్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. గతంలో వైసిపి కి చెందిన 23 మంది ఎం ఎల్ ఎ లను కొన్నారు. అందులో నలుగురిని మంత్రులను కూడా చేసారు. ఇలా చంద్రబాబు అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారంటూ రోజా మండి పడ్డారు.

మండలిలో టిడిపి రూల్స్ ప్రకారం వెళ్ళలేదు, ముందుగా నోటికి ఇచ్చివుంటే బాగుండేది. అలా చేయలేదు, మండలికి వెళ్లే బిల్లులను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా తిప్పి కొడుతున్నారు. శాశన మండలిని రద్దు చేయాల్సిందే అని పట్టు పట్టారు. రాయలసీమను చంద్రబాబు నాశనం చేసారు. ఇప్పుడు జగన్ రాయలసీమను అభివృద్ధి చేస్తు.. కర్నూలును రాజధానిగా చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.

అమరావతిలో చంద్రబాబు తన బినామీల భూముల్ని కాపాడుకోవడానికే మండలిలో ఈ డ్రామా ఆడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎంతో అభివృద్ధిని చూపించారు. ప్రజలకు ఇచ్సినా హామీలను నెరవేర్చారు. ప్రజలంతా ఆయనను మెచ్చుకుంటున్నారు. ప్రజా తీర్పును గౌరవించాల్సింది పోయి కావాలని టిడిపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని మండి పడ్డారు. అంతే కాదు లోకేష్ ఎదో ఘనకార్యం చేసినట్టు ఫీలవుతున్నాడు. బాగా బలిసిన కోడి .. చికెన్ షాపుముందు తొడగొడితే ఏమవుతుంది .. కోసి కారం పెడతారు అంటూ ఘాటుగా స్పందించారు రోజా. ఈ విషయాన్నీ లోకేష్ తెలుసుకోవాలి, యనమలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మండలి ఉండడం వెస్ట్ దాన్ని తొలగించాలని రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దల సభ అంటే పెద్దల్ని సభకు పంపాలి కానీ ఇంట్లో ఉన్న దద్దమ్మలను, దద్దోజనాలను కాదు, చంద్రబాబుకు ఓడినా అహంకారం తగ్గలేదు అంటూ ఘాటుగా ఫైర్ అయింది రోజా !!