పార్టీని వదిలేయటానికి అసలు కారణం ఇదేనా ?

పార్టీలోను, ఎల్లోమీడియా రాతలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడుతో ఫిరాయింపు నేత ఆదినారాయణరెడ్డి దాదపు గంటసేపు భేటీ అయ్యారు. తమ తాజా భేటిలో తాను బిజెపిలో చేరటం ఖాయంగా చెప్పేశారని సమాచారం. పార్టీలోని ఉండమని చంద్రబాబు బ్రతిమలాడినా ఆది నారాయణరెడ్డి వినలేదట.

సరే ఇదంతా బాగానే ఉంది కానీ టిడిపిని వదిలేయటానికి అసలు కారణం ఏమిటి ? ఏమిటంటే ఆర్ధిక విషయాలే ప్రధానమని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు బలవంతం మీదే ఆది కడప ఎంపిగా పోటి చేశారు. జమ్మలమడుగు ఎంఎల్ఏగానే పోటి చేస్తానని ఆది ఎంత పట్టుబట్టినా చంద్రబాబు వినలేదు. వేరే దారిలేక చివరకు ఆది ఎంపిగా పోటి చేశారు.

ఎంపిగా పోటి చేయటానికి తన దగ్గర అంత డబ్బు లేదని ఆది చెబితే ఎంతో కొంత తాను సర్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారట. సరే ఎన్నికల్లో పోటి చేసిన ఆది ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల్లో ఆదికి చేతి చమురు బాగానే వదిలినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. తనకు ఎంత ఖర్చయిందో చెప్పిన ఆది తన డబ్బుపోను మిగిలిన డబ్బు ఇవ్వమని అడిగారట. దానికి చంద్రబాబు ఒప్పుకోలదని సమాచారం.

పార్టీ పరిస్ధితిని వివరించిన చద్రబాబు తన దగ్గర కూడా డబ్బు లేదని ఉన్నపుడు ఇస్తానని చెప్పారట. అదే సమయంలో అయిన ఖర్చుకు లెక్కలు చూపమని అడగటంతో ఆదికి మండిపోయిందట.  చంద్రబాబు నుండి ఎటువంటి డబ్బు అందదని ఆదికి బాగా అర్ధమైపోయిందట. నియోకవర్గంలోని సమస్యలకు తోడు ఆర్ధిక పరిస్ధితి బాగా దెబ్బ తీసిందట. అందుకనే టిడిపిలో ఉండటం వేస్టనుకున్న ఆది బిజెపిలోకి మారిపోతున్నట్లు చెప్పేసి వచ్చేశారట.