YS జగన్ కు తన రాజకీయా జీవితంలో ఇంత కీలక సమయం మరెప్పుడు రాదూ అంటే అతిశయోక్తి కాదు . ఒక ప్రాంతీయ పార్టీగా తాను ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లో సొంత గా అధికారం లో రాలేకుంటే ఆ పార్టీ తిరిగి 5 సంవత్సరాలు ప్రజల మధ్య వుండి పోరాటం చెయ్యటం చాలా కష్టం . చాల వరకు ప్రాతీయ పార్టీలు ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లో సొంతం అధికారంలోకి వచ్చాయి లేకుంటే జాతీయపార్టీ తో జత కలిసి కేంద్రం లోనో రాష్ట్రము లోనో అధికారం చెప్పటాయి . వైస్సార్సీపీ కి అలాంటి అవకాశం కూడా రాలేదు, ముందు కూడా సంకీర్ణం లో భాగస్వామి అయ్యే అవకాశాలు తక్కువే . కాబట్టి వున్నా ఏకైక మార్గం సొంతం గా రాష్ట్రంలో అధికారం చేపట్టడం . ఒక వేళా అధికారంలోకి రాలేకపోతే పార్టీ ని కాపాడుకోవడం అంటే ఇప్పుడున్న ఫిరాయింపు రాజకీయాల మధ్య అది సాధ్యపడకపోవచ్చు .