పవన్ కు వెన్నుపోటు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో  ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.  మీడియా స్వేచ్చ పై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పవన్ కూడా పాల్గొనాల్సుంది. అయితే ఆఖరు నిముషంలో పవన్ మానుకున్నారు.

అదే సమయంలో సమావేశం నిర్వాహకులకు ఓ సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తనకు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. వెన్నుపూసకు తగిలిన గాయంతో వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా బాగా నెప్పి వస్తోందన్నారు.

డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోమని చెప్పినా వద్దనుకుని సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగానే తాను సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు స్పష్టంగా చెప్పారు.

పవన్ చెబుతున్న వెన్నునొప్పటంటే మామూలు విషయం కాదు. తొందరగా వెన్నుపూసలు సర్దుకోవటం, డిస్క నొప్పి నయం కావటం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ కారణంగా రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  ఒకవేళ జనసేన పోటి చేసినా పవన్ ప్రచారం చేయటం మాత్రం డౌటే అనిపిస్తోంది.