శాసన మండలిని రద్దు తీర్మానం చేయించిన జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజలముందుకు రావాలని చంద్రబాబు సవాల్ చేసారు. ఈ సారి వై సిపి గెలిస్తే తాను రాజకీయాలనుండి తప్పుకుంటానని ప్రకటించారు. మండలిని రద్దు చేయాలనీ కోరుతూ సోమవారం అసెంబ్లీ లో తీర్మానం ఆమోదించాకా రాత్రి అయన మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. రాజధాని బిల్లును మండలి సెలెక్ట్ పంపడమతొ మీ అహం దెబ్బ తిన్నందుకే దానిని రద్దు చేయాలనీ తీర్మానం తెచ్చారని అన్నారు.
రాజధానిపై మార్పు పై మీ వాదనకు ప్రజామోదం ఉందనుకుంటే రెఫరెండం నిర్వహించండి. అందులో ఏమి వస్తే దానికే కట్టుబడదాం అంటూ చంద్రబాబు అన్నారు. మండలి రద్దు తీర్మానం విచారకరమని, దానికి ఖండిస్తున్నామని తెలిపారు. ఆక్రోశంతో మండలిని రద్దు చేయడం అవివేకమని అన్నారు. మండలి నడచిన రోజుల్లో రోజుకు కోటి రూపాయల చొప్పున ఖర్చు అవుతాయని లెక్క వేశారు .. కానీ మండలి ఏడాదికి 30 రోజులకు మించి సమావేశం కావడం లేదు. ఆ లెక్కన చుస్తే 30 కోట్లు అవుతుంది .. తాను వారిని ఒకేసారి కోర్టుకు వెళ్ళొస్తే 60 లక్షలు ఖర్చు అవుతుందని . .జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ లెక్కన అయన కోర్టు ఖర్చులు కూడా ఏడాదికి 30 కోట్లు అవుతాయని చంద్రబాబు అన్నారు.