టీడీపీ ఆశా కిరణం ‘జూ ఎన్టీఆరే’..  మరి లోకేష్..?    

 
నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు..  సెలబ్రెటీలు తారక్ కు పోటీపడి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏ స్టార్ హీరో పుట్టిన రోజుకి ఇంత హడావుడి చూడలేదు. మరి ఎన్టీఆర్ కే ఎందుకు..?  తారక్ స్నేహమే కారణమా..? గతంలో తారక్ వేరు ఇప్పటి ఎన్టీఆర్ వేరు. ఇండస్ట్రీలో పెద్ద చిన్నా అని తేడా లేకుండా  తన పరిధిలో ప్రతి ఒక్కరితో  మంచి సంబధాలను ఏర్పచుకున్నాడు.  సీనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి వ్యక్తికి  గౌరవాన్ని విలువను ఇస్తాడని విన్నాం.  ఇప్పుడు గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకున్న  ‘కేసీఆర్’ లాంటి వాళ్ళకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎన్టీఆరే. అలాంటి ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా..? రావాలనుకున్నా టీడీపీ నాయకులు స్వాగతం చెబుతారా ?  ఆ మధ్య గిరిబాబు లాంటి సీనియర్ నటులు కూడా టీడీపీకి భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆరే అని చెప్పిన విషయం తెలిసిందే.
 
కానీ,  ‘జూనియర్’ పై గతంలో  లోకేష్,  బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్  చేసిన వాఖ్యలు విన్నాం కదా.  ఏమైనా  ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో   టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి ఇంకా ప్రజలకు గుర్తు ఉంది.  అంతటి దారుణమైన ఓటమి నుండి కోలుకున్నాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయాలంటే కొత్త నాయకుడు రావాలి. అందుకే  పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి అప్పగించాలని ఆశ పడుతున్నారు కొంతమంది కుల పెద్దలు. అయితే  బాబు ఉండగా  టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతమేరకు లేదు అనేది ఆ పార్టీలోని మరికొందరు వాదన.
 
ఏమైనా ఒక్కటి మాత్రం చాల స్పష్టంగా అర్ధమవుతుంది. లోకేష్ రేసులో ఉండగా టీడీపీ నేతగా ఎన్టీఆర్ కు  పట్టం కట్టడం అనేది సాధ్యం అయ్యే  పని కాదు,  అయితే, లోకేష్ తమకు నాయకుడు మారితే  తెలుగు తమ్ముళ్లకు భవిష్యత్తు ఉండదు అనేది వారి ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకమే నిజం అయ్యేలా కనిపిస్తే మాత్రం.. కచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం.  అపుడు బాబు లేదా లోకేషో  ఎన్టీఆర్ ను దూరం పెట్టినా  ఆపాలనుకున్నా..  టీడీపీ పార్టీ ఎన్టీఆర్ చేతిల్లోకి పోకుండా అడ్డుకోవడం సాధ్యం అయ్యే  పని కాదు.