టిడిపికి గుడ్ బై చెప్పనున్న సాధినేని

తెలుగుదేశంపార్టీకి సాధినేని యామిని గుడ్ బై చెప్పనున్నారు. ఎన్నికలకు ముందు టిడిపిలో యాక్టివ్ అయిన సాధినేనికి చినబాబు నారా లోకేష్ మద్దతుందని బాగా ప్రచారంలో ఉంది. అందుకనే పార్టీలో చేరగానే అధికార ప్రతినిధి పదవి దక్కిందని కూడా చెప్పుకుంటారు. ఇక ఎన్నికల సమయంలో ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునే టిడిపి నేతల్లో  సాధినేని కూడా ఒకరు.

జగన్, పవన్ వ్యక్తిగత విషయాలపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన సాధినేనికి ఎల్లోమీడియా కూడా బాగా మద్దతిచ్చింది. అలాంటి సాధినేని బిజెపిలో చేరాలని డిసైడ్ చేసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీలు కూడా జరిగాయట. కాబట్టి కమలం పార్టీ కండువా కప్పుకోవటమే మిగిలింది. నిజానికి టిడిపిలో సాధినేని ఉన్నంత కాలం పార్టీకి ఎటువంటి ఉపయోగం కనబడలేదు. పార్టీ అధికారప్రతినిధిగా ఆమె గుర్తింపు తెచ్చుకోవటమే కానీ ఆమె వల్ల పార్టీకి వీసమెత్తు ఉపయోగం ఎక్కడా కనబడలేదు.

అలాంటి సాధినేని ఇపుడు టిడిపిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇటువంటి పరిస్దితుల్లోనే ఆమె టిడిపికి తొందరలోనే రాజీనామా చేయబోతున్నారని సమాచారం. తర్వాత బిజెపిలో కూడా చేరుతారని పార్టీ వర్గాలు చెప్పాయి.  ఎప్పుడైనా సాధినేని టార్గెట్ ఒకటే. జగన్, పవన్ ను నోటికొచ్చినట్లు తిట్టటమే ఆమెకు తెలిసింది. మళ్ళీ వీళ్ళద్దరిలో కూడా జగన్ పైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు.

మొన్నటి ఎన్నికల్లో తనను తాను చాలా ఎక్కువగా ఊహించేసుకున్న సాధినేని జగన్ పై నోటికొచ్చినట్లు విమర్శలు చేసేవారు. నిజానికి ఆమె కౌన్సిలర్ గా కూడా గెలిచే సీన్ లేదు. అయినా సరే ముఖ్యమంత్రి అభ్యర్ధి మీద నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. కాబట్టి ఇపుడు బిజెపిలో చేరినా ఆమె టార్గెట్ అయితే మారదన్నది వాస్తవం. మరి బిజెపిలో చేరిన తర్వాత ఏ రేంజిలో చెలరేగిపోతారో చూడాల్సిందే.