జూనియర్ ఎన్ఠీఆర్ కోసం బాలయ్య స్కెచ్ ..!

నందమూరి హరికృష్ణ మరణంతో ఆ కుటుంబంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి . ఎంతో కాలం నుంచి చంద్ర బాబు వారిని దూరంగా పెట్టాడు . రాజకీయంగా హరికృష్ణను ఎదగనీయకుండా చేశాడు . అలాంటి బాబు మొన్న హరికృష్ణ మృతి చెందిన రోజు అన్నీ తానే అయి నిర్వహించాడు , ఇక బాలకృష్ణకు జూనియర్ అంటే ఒకరకమైన చిన్న చూపు ఉండేది . అతనికి స్టార్ స్టేటస్ వచ్చినా జూనియర్ ను చేరతీయలేదు . ఎప్పుడు ఆప్యాయంగా మాట్లాడింది లేదు . . బాలకృష్ణ తన రెండవ కూతురు వివాహ నిశ్చితార్ధం సందర్భంగా జూనియర్ వెడితే కనీసం పలుకరించకపోగా బాలయ్య అవమానించాడని , జూనియర్ కన్నీళ్ల పర్యంతమై వెళ్లిపోయాడని చెప్పుకున్నారు . ఇది తెలిసి తన బిడ్డను అవమానిస్తావా ? అని హరికృష్ణ బాల కృష్ణతో మాట్లాడటం మానేశాడని అంటారు .

హరికృష్ణ , తన పెద్ద కొడుకు జానకీరామ్ మరణం తరువాత కళ్యాణ్ రామ్, తారక రామారావుతో కలసి బాలయ్య , చంద్ర బాబు మీద పోరాటం చేశాడని సన్నిహితులు చెబుతారు . తన తాత పెట్టిన పార్టీలో తన తండ్రికి విలువ లేకుండా పోయిందని జూనియర్ ఎన్ఠీఆర్ వాపోయేవాడట . బాలకృష్ణ తన అన్న హరికృష్ణ మరణం తరువాత మారినట్టు తెలిసింది . జూనియర్ ఎన్ఠీఆర్ స్టామినా ఏమిటో బాలయ్యకు బాగా తెలుసు . జూనియర్ ఎన్ఠీఆర్ కు తన తండ్రి పోలికలు రావడంతో అతన్ని చిన్నప్పటి నుంచే ప్రేక్షకులు అభిమానించేవారు . ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో జూనియర్ ఎన్ఠీఆర్ ను పెట్టె ఆలోచన ఉన్నట్టు తెలిసింది . ఫ్లాష్ బ్యాక్ లో ఎన్ఠీఆర్ పాత్రలో జూనియర్ ను ఉంచితే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చిందని తెలుస్తుంది . బాలకృష్ణ , దర్శకుడు క్రిష్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది .

ఈ సినిమా ప్రారంభానికి జూనియర్ ఎన్ఠీఆర్ ను ఆహ్వానించలేదు . అప్పుడు జూనియర్ బాధపడ్డాడు . అయినా బాబాయ్ బాలకృష్ణ అడిగితే తప్పకుండా తాత గారి చిత్రంలో నటిస్తానని అన్నాడు . కానీ దీనిపై బాలయ్య స్పందించలేదు . అయితే ఇప్పుడు బాలకృష్ణ జూనియర్ ను కలుపుకొని పోతే ఇటు సినిమా రంగంలోనూ , అటు రాజకీయ రంగంలోనూ లాభముందని గ్రహించాడని అంటున్నారు . జూనియర్ ఎన్ఠీఆర్ కూడా నందమూరి వారసుడే కనుక బాలయ్య రాజీ పడ్డాడని అనుకుంటున్నారు .

ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్ఠీఆర్ నటించడం అంటూ జరిగితే అనూహ్యయంగా వ్యాపారం జరిగే అవకాశం వుంది . ఆ సినిమా కు ప్రేక్షకులు బ్రాహామా రధం పెట్టె అవకావం వుంది . రాజకీయంగా కూడా మైలేజీ వచ్చే అవకాశం వుంది . అన్నీ కుదిరితే ఈ సినిమాను 2019 జనవరి 9న విడుదల చేసే అవకాశం వుంది . 1983 జనవరి 9 న రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజు .
జూనియర్ విషయంలో బాలయ్య స్కెచ్ సినిమా వరకేనా ? మరింకేదైనా ఉందా ?