మూడు రాజధానుల విషయంలో ఆంధ్రా లో రెండు వర్గాల మధ్య గట్టి వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాజధానులు వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ టీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటే .. లేదు మూడు రాజధానులు ఖచ్చింతగా ఏర్పాటు చేసి తీరుతాం అంటూ జగన్ సర్కార్ సన్నాహాలు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల మద్దతు తెలిపేందుకు ఏకంగా చంద్రబాబు సొంతూరును ఎంచుకున్నారు వై సిపి నేతలు. అక్కడ ఆదివారం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లైయితే చేసారు కానీ పెద్దగా జనాలు మాత్రం రాలేదు ?
చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెకు సమీపంలోని రంగం పేటలో నిన్న వై సిపి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు వ్యతిరేకంగా టిడిపి నేతలు శాంతియుత ర్యాలీకి పిలుపునివ్వడంతో అక్కడ కొంత వాతావరణం వేడెక్కింది. ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు కూడా భారీగానే మోహరించారు. నారావారి పల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం .. దానికి బిన్నంగా టిడిపి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరపడం విశేషం. అయితే వై సిపి భహిరంగ సభ మాత్రం చాలా నిరాశగా జరిగింది. అక్కడున్న నాయకులూ, కార్యకర్తలు తప్ప పెద్దగా జనాలు వచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయంలో మీడియా కూడా విజువల్స్ చూపిస్తూ .. వై సిపి సభలో జనాలేరి అంటూ రకరకాల కథనాలు చూపించాయి . దీంతో మాజీ మంత్రి నారా లోకేష్ .. జఫ్ఫాలు .. ఇది వాస్తవం అంటూ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. నారా లోకేష్ వై సిపి వాళ్ళను టార్గెట్ చేస్తూ ఆ కామెంట్ పెట్టాడంటూ పెద్ద రచ్చే జరుగుతుంది.