జనాలు  తిరగబడటం ఖాయమేనా ?

చంద్రబాబునాయుడుపై తొందరలోనే జనాలు తిరగబడటం ఖాయంగా కనిపిస్తోంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబును చూస్తుంటే ఈయనేనా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  తాను  చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేసినందుకే చంద్రబాబులో ఉక్రోషం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకనే గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

ముందుగా వాలంటీర్ల గురించి మాట్లాడుతూ నెలకు 5 వేల రూపాయల జీతానికి పనిచేసే వాలంటీర్లు వివాహం చేసుకునేందుకు ఎవరూ పిల్లను కూడా ఇవ్వరంటూ కామెంట్ చేశారు. దాంతో అప్పట్లో పెద్ద వ్యతిరేకత ఎదురైంది. తర్వాత బియ్యం బస్తాలు మోసే ఉద్యోగులు ఇచ్చి జగన్ పెద్ద బిల్డప్ ఇస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు.

తాజాగా మగాళ్ళు ఇళ్ళల్లో లేనపుడు గ్రామ వాలంటీర్లు ఇళ్ళకు వెళ్ళి తలుపులు తడుతున్నారంటూ చేసిన కామెంట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. గ్రామ వాలంటీర్ల జాబ్ చార్ట్ ప్రకారం ప్రతీ 50 ఇళ్ళకు ఒకరు వెళ్ళాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నది లేంది తెలుసుకోవాలి. ఇలాంటి అనేక బాధ్యతల వల్ల వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ళకు వెళ్ళాల్సుంటుంది. అంతే కానీ కనిపించిన ఇంటికి  జూలాయిల్లాగ వెళ్ళి తలుపులు తట్టటంలేదు.

నిజంగానే ఇంట్లోని ఆడవాళ్ళ విషయంలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. అంతేకానీ మగవాళ్ళు లేని సమయంలో వాలంటీర్లు వెళ్ళి తలుపులు తడుతున్నారంటూ చంద్రబాబు తప్పుడు సంకేతాలను జనాల్లోకి పంపుతున్నట్లే అనిపిస్తోంది. ఇలాగే చీప్ కామెంట్లు చేయటాన్ని చంద్రబాబు మానుకోకపోతే తొందరలోనే జనాలు తిరగబడటం ఖాయమనే అనిపిస్తోంది.