చిరుకు షాక్ ఇచ్చిన కమల్, ఇలా అనేసేడేంటి?

చిరంజీవి కు కౌంటర్ ఇచ్చిన కమల్

మెగాస్టార్‌ చిరంజీవి తన తోటి నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌కు ‘మీరు సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తులైతే.. రాజకీయాల్లోకి రాకండి’..సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తమిళ పత్రిక ఆనంద వికటన్‌ అనే మ్యాగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. తన రాజకీయ ప్రస్థానంతోపాటు పలు విషయాలను పంచుకున్నారు. సినీరంగంలో ‘నంబర్‌ వన్‌’ హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో తాను గతంలో రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు.

‘రాజకీయం అంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. కోట్లాది రూపాయలు ఉపయోగించి నా సొంతం నియోజకవర్గంలోనే నన్ను ఓడించారు. ఇటీవలి ఎన్నికల్లో నా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ఇదే అనుభవం ఎదురైంది’ అని చిరు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కొనసాగాలంటే పరాజయాలను, అవమానాలను, అసంతృప్తలను దిగమింగుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయమై కమల్ హాసన్ స్పందించారు.

కమల్ మాట్లాడుతూ…గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం వచ్చానని చెప్పారు. చిరంజీవి.. నాకెప్పుడూ సలహాలు ఇవ్వోద్దంటూ కమల్ వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణి పై అవగాహన పెరిగిందని కమల్ చెప్పారు.