క్షేత్రస్దాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. గడచిన పది రోజులుగా చలో ఆత్మకూరు ఇష్యూని మీడియా చాలా ఎక్కువగా హౌలైట్ చేసింది. ఎందుకింతగా హైలైట్ చేసింది ? ఎందుకంటే కేవలం చంద్రబాబునాయుడుకు అనుకూలంగా మాత్రమే మీడియా పనిచేసిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబు మధ్య ఉన్న రాజకీయ వైరంలో మెజారిటి మీడియా చంద్రబాబుకు మద్దతుగా నిలబడింది.
మీడియాను మ్యానేజ్ చేయటంలో చంద్రబాబు ముందు జగన్ ఎందుకూ పనికిరాడన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో నూరు రోజుల క్రిందట అధికారంలోకి వచ్చిన జగన్ పై చాలా మీడియా సంస్ధల యాజమాన్యాలు మండిపోతున్నాయి. ఎందుకంటే ఏ మ్యానేజ్ మెంటును కూడా జగన్ దగ్గరకు చేర్చలేదు. ఒక్క మీడియా సమావేశం పెట్టకపోగా కనీసం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూలు కూడా ఎవరికీ ఇవ్వలేదు. అడ్వర్టైజ్ మెంట్లు సంగతి సరే సరి.
అసలే మెజారిటి మీడియా చంద్రబాబు చేతిలో ఉంది. దాని మీద జగన్ అంటే మంట. ఇంకేముంది రెండూ కలిసి చలో ఆత్మకూరు విషయంపై గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలోని టిడిపి నేతలు స్పందించిన దానికన్నా మీడియా పదింతలు స్పందించింది. నిజానికి ఆత్మకూరు విలేజ్ లో విషయం ఏమిటయ్యా అంటే మామా, అల్లుళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువుల మధ్య విభేదాలు. దాన్నే చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకుని చివరకు బోర్లా పడ్డారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో మీడియా చేసిన ఓవర్ యాక్షనే ఎక్కువగా కనబడుతోంది. బంధువుల మధ్య గొడవలు ఈరోజుంటాయి రేపటి సర్దుకుంటాయి. ఇంతచిన్న విషయం కూడా చంద్రబాబు ఆలోచించలేకపోయారు. చంద్రబాబుకు విషయం తెలిసి కూడా కావాలనే జగన్ పై బురద చల్లేందుకే తన మద్దతు మీడియాను ఉసిగొల్పారని అర్ధమైపోతోంది.