చంద్ర‌బాబును లెక్క‌ల‌తో స‌హా.. ఉతికేసిన కాగ్..!

ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ హయాంలో సాగిన పాలన తీరు పై తాజాగా కాగ్ కడిగేసిందనే వార్త ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో, పలు ర‌కాల‌ పనుల్లో తీవ్ర జాప్యం చేయడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో ఆ ప్ర‌భావం రాష్ట్ర ఖజానా పై 29,616.29 కోట్ల మేర భారం పడిందని కాగ్ అచంనా వేసింది.

ఈ నేప‌ధ్యంలో ముఖ్యంగా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో.. వాటి ఫలాలు రైతులకు అందలేదని, ఇదే ఇప్పుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీసిందని కాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం‌ 27 సాగునీటి ప్రాజెక్టుల కోసం.. 43,031.61 కోట్లు ఖర్చు చేసింద‌ని.. అయితే స‌కాల‌లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని కాగ్ తెలిపింది.

దీంతో ఆయా పనుల్లో జాప్యం కార‌ణంగా ప్రాజెక్టుల అంచనా వ్యయం 28,423.64 కోట్ల నుంచి 58,039.93 కోట్ల‌కు పైగానే పెరిగింద‌ని, దీంతో ఏపీ ఖజానాపై 29,616.29 కోట్ల మేర భారం పడింద‌ని కాగ్ వెల్ల‌డించింది. ఇక చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కోసం 311.60 కోట్లు, అలాగే తాడిపూడి ఎత్తిపోతలకు సంబంధించి 113.28 కోట్లను ఖర్చు చేయకపోవడంతో అవి పూర్తిగా నిష్ఫలమయ్యాయ‌ని.. దీంతో గ‌త ప్ర‌భుత్వం పనులు సకాలంలో పూర్తి చేయలేక చేతులెత్తేసింద‌ని కాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.