చంద్రబాబు నోరు లేవటం  లేదే ?

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళను చూసి చంద్రబాబునాయుడు, టిడిపి నేతలకు నోళ్ళు లేవటం లేదు. ముందేమో గ్రామ సచివాలయాల ఏర్పాటే సాధ్యం కాదన్నారు. తర్వాతేమో ఉద్యోగాల భర్తీ కుదరదన్నారు. చివరకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రశ్నపత్రం లీకైందంటూ నానా యాగీ చేశారు. వరుసపెట్టి ప్రశ్నపత్రాలు లీకేజీలంటూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వార్చారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు కూడా నోరు లేవటం లేదు. ఎందుకంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోని వివిధ క్యాటగిరీల్లో  ఉద్యోగాలు సాధించిన 1.3 లక్షల మందిలో టిడిపి నేతలు కూడా ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన వాళ్ళల్లో టిడిపి తరపున ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారున్నారు.

అలాగే టిడిపి సీనియర్ నేతల పిల్లులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. చివరకు ఎల్లోమీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు కూడా ఉన్నారట. ఉద్యోగాల ఎంపికలో పారదర్శకత పాటించకపోతే టిడిపి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారికి, నేతల వారసులకు, చివరకు ఎల్లోమీడియా ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవేనా ?

ఉద్యోగాల ఎంపికలో కులం, మతం, పార్టీలు ఏవీ చూడవద్దని మొదటినుండి జగన్ చెబుతున్నట్లుగానే ప్రక్రియ మొత్తం సాగింది. అందుకు ఎంపికైన అభ్యర్ధుల నేపధ్యమే సాక్ష్యం. అలాగే గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో  మెజారిటి జనాలు జనసేన సానుభూతిపరులే. మొన్నటి ఎన్నికల్లో జనసేన కోసం పనిచేసిన వారే అయినప్పటికీ ఆ గ్రామంలో తొమ్మిది మందికి ఉద్యోగాలొచ్చాయట. ఇంతకన్నా పారదర్శకతకు నిదర్శనం ఏం కావాలి ?