చంద్రబాబుకు వారమే డెడ్ లైన్

కరకట్ట మీద నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని ఖాళీ చేయటానికి చంద్రబాబునాయుడుకు వారం రోజులు మాత్రమే డెడ్ లైన్ గా ఉంది. కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని సిఆర్డీఏ గట్టిగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే చాలామందికి నోటీసులు కూడా ఇచ్చింది గతంలోనే. సరే కొంతమందేమో కోర్టును ఆశ్రయించారు. మరికొందరేమో సిఆర్డీఏతో సంపద్రింపులు జరుపుతు తమది అక్రమ నిర్మాణం కాదని చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సిఆర్డీఏ నుండి నోటిసులు అందుకున్న వారిలో లింగమనేని రమేష్ కూడా ఉన్నారు. లింగమనేని అంటే చంద్రబాబు నివాసముంటున్న భవనం యజమాని (?). భవనం యజమాని అని గట్టిగా చెప్పేందుకు కూడా లేదు. ఎందుకంటే ఈ భవనంపై చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నపుడేమో భవనాన్ని లింగమనేని ప్రభుత్వానికి రాసిచ్చేశారని చెప్పారు. కానీ ప్రతిపక్షంలోకి రాగానే ఇదే భవనం ప్రైవేటుదని చెబుతున్నారు.

అంటే కావాలనే జనాలను అయోమయంలో పడేసేందుకే చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని అర్ధమైపోతోంది. లింగమనేని తన భవనాన్ని చంద్రబాబుకు రాసిచ్చేశారని కూడా ప్రచారంలో ఉంది లేండి. అందుకనే ఆ భవనాన్ని ఖాళీ చేయకుండా చంద్రబాబు పట్టుకుని ఊగులాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి అక్రమ నిర్మాణమంటూ సిఆర్డీఏ ఇచ్చిన నీటిసును లింగమనేని ఏమాత్రం లెక్క చేయలేదు.

అందుకనే తాజాగా సిఆర్డీఏ మరో నోటిసు ఇచ్చింది. భవనంలో నిర్మించిన ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మించిన డ్రెస్సింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్ అక్రమ నిర్మాణమే అని తేల్చేసింది. అందుకనే వాటిని కూలగొట్టటానికి వారం రోజులు సమయం ఇచ్చారు. ఒకవేళ వారంలో అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే తామే ఆ పని చేస్తామంటూ చెప్పింది. సిఆర్డీఏ వాలకం చూస్తుంటే చంద్రబాబు మరో రచ్చ చేయటం ఖాయంగానే తోస్తోంది.