కియా మోటర్స్ .. తరలిపోతుందా ?

ఆంధ్రాలో ఉన్న కీయ మోటార్స్ తరలిపోతోంది అంటూ న్యూస్ రాజకీయా వర్గాల్లో సంచలనం రేపుతోంది. కీయ మోటర్స్ ని తమిళనాడు తరలిస్తున్నారంటూ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జాతీయ మీడియాలో వచ్చిన వార్తతో .. ఇక్కడి లోకల్ పత్రికలూ కియా తరలిపోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అయితే ఈ విషయం తప్పుడు ప్రచారం అని ఎపి ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. కియా పరిశ్రమ యాజమాన్యానికి, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ అన్నారు. లోక్ సభలో కూడా దీనిపై టిడిపి సభ్యులు ప్రశ్నల రూపంలో సమస్యను లేవనెత్తారు. కీయ పరిశ్రమ తరలిపోతుందంటూ సాగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ బుగ్గన తెలిపారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా కియా పరిశ్రమ యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపారని అయన తెలిపారు. కీయ మోటర్స్ ఎక్కడికి వెళ్ళదని, త్వరలోనే ఆ కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుందని మంత్రి అన్నారు. కావాలనే కీయ పరిశ్రమ తరలిపోతుందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి ఫైర్ అయ్యారు. ఇలాంటి అసత్య వార్తలపై ప్రచారం చేస్తే వారికీ తగిన శిక్ష పడుతుందని అయన హెచ్చరించారు.