మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతుంది. ఈ బిల్లు మండలిలో ఆమోదం పొందకపోవడంతో జగన్ సర్కార్ మండలి రద్దుకు రంగం సిద్ధం చేసింది. ఈ రోజు అసెంబ్లీలో మండలి రద్దు బిల్లును ప్రవేశ పెట్టడం.. దానికి అందరు ఆమోదం చెప్పడం కూడా జరిగిపోయాయి. అయితే తాజాగా ఢిల్లీ లోని ఎపి భవన్ లో ఉన్న ఐ లవ్ అమరావతి అనే బోర్డు తొలగించాలని జగన్ సర్కార్ ఆదేశించడంతో ఆ బోర్డు ను తొలగించారు.
దేశ రాజధాని ఢిల్లీ లో ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఐ లవ్ అమరావతి అనే బోర్డును .. నేటి ట్రెండీగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఈ బోర్డు ను.. అమరావతిలో రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసాక ఢిల్లీ లో ఆ బోర్డు ఏర్పాటు చేసారు. ప్రస్తుతం జగన్ సర్కార్ పదవిలో ఉంది .. దానికి తోడు ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని కాదు .. అమరావతితో పాటు కర్నూల్, వైజాగ్ లను కలిసి మూడు రాజధానులుగా జగన్ ప్రకటించడంతో ఢిల్లీ ఎపి భవన్ లో ఏర్పాటు చేసిన ఐ లవ్ అమరావతి అనే బోర్డును తొలగించారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే పెద్ద రచ్చ జరుగుతుంది. కావాలనే ఆ బోర్డు తొలగించారా ? లేక ప్రభుత్వం చెప్పి చేయించిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కోతులు ఆ బోర్డును పాడు చేస్తున్నాయన్న కారణంగానే దాన్ని తొలగించినట్టు ఎపి భవన్ అధికారులు చెబుతున్నారు. మరి ఇందులో ఏ మతలబు ఉందొ అన్నది చూడాలి.