ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

ఈ రోజు 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆర్థిక సర్వే ను ప్రవేశ పెట్టారు. రేపు ఉదయం ఆమె వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారట. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 నుండి 6. శాతం ఉన్నట్టు ఆమె తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్ధిక పరిస్థితులను ఈ సర్వే లో పొందుపరుస్తారట. సర్వే లోని పూర్తీ వివరాలు కొద్దీ సేపట్లో మీడియాకు అందనున్నాయి. అనంతరం లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

రేపు ఆర్థిక సర్వే ను ప్రవేశ పెట్టిన విషయంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వార్షిక బడ్జెట్ ఎలా ఉంటాబోతోంది అన్న టెన్షన్ అటు రాష్ట్రాలకు పట్టుకుంది. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఎంత మొత్తం కేటాయిస్తారా .. ఏ డిపార్ట్మెంట్ లకు, రాష్ట్రాల అభివృద్ధికి ఎలా నిధులను ఎంత కేటాయిస్తారా లాంటి అంశాలు ఇప్పుడు అందరిలో ఆసక్తి ని పెంచేలా ఉన్నాయి. మరి ఆర్థికసర్వే లోని వివరాలు మరి కొద్దీ సేపట్లో రానున్నాయి.