అమ్మాయి అర్ధరాత్రి ఫోన్.. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన రెస్పాన్స్ వింటే..!

ప్రభుత్వ కార్యాలయాల్లో ఓ పై స్థాయి అధికారిని కలవాలన్నా, సాయంత్రం ఆరు దాటితే వారి నుండి సమాధానం రావడం అన్నా ఎంత కష్టమో తెలిసిందే. అలాంటిది ఓ ముఖ్యమంత్రి.. అది కూడా అర్థరాత్రి.. సమయం 1:30, ఫోన్ చేయగానే సమాధానం చెప్పారు.. మీకు అన్ని విధాలా సాయం చేస్తాం అంటూ భరోసా ఇచ్చి చెప్పినట్లుగానే ఆ ఆడపిల్లలను వారి ఇళ్లకు చేర్చాడు.

నిజంగా అలాంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది కదా.. కానీ ఇది నిజం.. ఎక్కడా.. ఆయన ఎవరూ అంటే.. కరోనా లాక్ డౌన్‌తో హైదరాబాద్‌లో హాస్టళ్లు మూతబడ్డాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులు, ఉద్యోగిణులు రోడ్డున పడ్డారు. ఊళ్లకు వెళ్లిపొండంటూ పోలీసులు ఇచ్చిన ఎన్ఓసీలు చేతబట్టుకుని నానా కష్టాలు పడ్డారు. తమ సొంత రాష్ట్రాలకు దారి బట్టారు. అంతర్ రాష్ట్ర సరిహద్దులు మూసివేయండతో రహదారులపైనే పడిగాపులు కాశారు. అయినా సరే ఇంటికి చేరాలంటే.. క్వారంటైన్ తప్పనిసరి అంటూ ఓ సీఎం ప్రకటించారు. కానీ ఆ రాష్ట్ర సీఎం వేరు..

హైదరాబాద్ నుంచి 13 మంది యువతులు కేరళలోని కొళిక్కోడ్ వెళ్లేందుకు ఓ కంటెయినర్ మాట్లాడుకున్నారు. అయితే సరిహద్దులు మూసేశారు కాబట్టి కర్నాటక, కేరళ బోర్డర్‌లోని ముతంగ చెక్‌పోస్టు వద్దనే దింపేస్తానని డ్రైవర్ చెప్పాడు. చేసేది లేక సరే అనుకున్నారు. అయితే అది దట్టమైన అటవీ ప్రాంతం.. అక్కడ ఆ రాత్రి దిగితే పరిస్థితి ఏంటి అన్నది అర్థం కాలేదు. తమ కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరికీ తెలిపారు. అయితే అప్పటికే అర్థరాత్రి దాటింది.. ఆ సమయంలో ఎవరూ రాలేరు.. ఎలా అనుకుంటూనే.. అందులో ఓ యువతి కేరళ సీఎం పినరయి విజయన్ రెసిడెన్స్ నంబరుకు కాల్ చేసింది. సీఎం స్వయంగా కాల్ రిసీవ్ చేసుకున్నారు. నమ్మశక్యం కాకపోయినా.. తేరుకుని తమ బాధను చెప్పుకుండి. ఆయన వెంటనే వాయనాడ్ కలెక్టర్, ఎస్పీల నంబర్లు ఆమెకు ఇచ్చాడు, ఆయన కూడా వాళ్లకు కాల్ చేస్తానని చెప్పాడు. ఎస్పీ కాల్ తీశారు. వాహనాన్ని ఏర్పాటు చేసి అందరినీ తమ ఇళ్లకు పంపేశారు. పైగా వారిపై ఎలాంటి ఆంక్షలు కూడా పెట్టలేదు. దటీజ్ కేరళ సీఎం పినరయి విజయన్ అని మరోసారి అనిపించుకున్నారు.