అరె.. చంద్రబాబుకు  క్లారిటీ  వచ్చిందోచ్ !

 
చంద్రబాబుకు  తాజాగా  క్లారిటీ వచ్చిందట. నేతల అసంతృప్తులు, అసమ్మతులు తెలిసివచ్చాయట.  పార్టీని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అందరి సలహాలు, సూచనలు విన్న చంద్రబాబు ఏపీలో తిరిగి తన పార్టీని పునరుద్ధరించడానికి క్షేత్ర స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా కొందరు సీనియర్ నాయకులు టీడీపీ  సమావేశాలకు దూరంగా ఉంటుండటంతో,  చంద్రబాబు పార్టీలోని ప్రతి నాయకుడితో వారి వారి అసంతృప్తుల గురించి  వారితో మాట్లాడుతున్నారట. 
 
 
ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నోరా వారిని చంద్రబాబు కూల్ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ క్లిష్ట సమయంలో పార్టీతో కలిసి ఉండాలని.. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తారా? లేక ఇతర పార్టీలోకి వెళ్లి టీడీపీ విడిచి పెట్టి సురక్షితంగా ఉండాలనుకుంటున్నారా అని చంద్రబాబు వారి ముఖం మీదే అడిగారట. పార్టీ విధేయులతోనే తాను తిరిగి టీడీపీని ఏపీలో బలోపేతం చేయాలనుకుంటున్నానని.. పార్టీ మారే అవసరం లేదని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది.

 

ఇక పార్టీని బలోపేతం చేయడం.. కేడర్ ధైర్యాన్ని పెంచేందుకు నియోజకవర్గం వారీగా కమిటీలను నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నాడట.. తద్వారా వైసీపీ దాడిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.  అయితే ఎన్ని చేసినా ప్రస్తుతం వైసీపీని ఢీకొట్టే పరిస్థితిలో పార్టీ లేదు. తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు, పార్టీ కోలుకోవడానికి చాలా బలం అవసరం ఉంది. కానీ ఆ బలం బాబులిద్దరిలోనూ లేదాయే.