అనుకున్నది సాధించిన జగన్!

సీఎం జగన్ మరోసారి తాను అనుకున్నది సాధించారు. ఎన్ని అవరోధాలు వచ్చినా.. చివరకు టీడీపీ సుప్రీం కోర్టుకు వెళ్లినా.. స్థానిక ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనుకున్నదే జరుగుతుంది.

బీసీల హక్కులను కాలరాస్తున్నారని అరోపణలు వెల్లువెత్తినా సరే జగన్ మాత్రం స్థానిక ఎన్నికల విషయంలో ముందుకే అన్నారు. అనుకున్నట్లుగానే ఇవాళ నోటుఫికేషన్ ఇప్పించుకుంటున్నారు. విపక్షాలను కుదేలు చేసి వాటికి సమయం కూడా ఇవ్వకుండానే ఎన్నికల తంతును మూడు వారాల్లో ముగించేస్తున్నారు.

అచ్చం పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఇలాగే.. అక్మడా తాను అనుకున్నది చేసుకుపోతుంటారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే ఆయన అనుకున్నదే చేస్తారు.. జగన్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. తాను అనుకున్నది ఏ అవరోధం ఎదురైనా సరే వాటిని లెక్కచేయకుండా చేసుకుపోతున్నారు.

జగన్ అనుకున్నట్లే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. దానితో పాటే ఎన్నికల నోటిఫికేషన్‌నూ శనివారమే ఇస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే రాజకీయ పార్టీలతో చర్చించిన సందర్భంగా.. కొన్ని పార్టీలు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, ఎన్నికలు నిర్వహించడం కష్టమని అభిప్రాయపడ్డా.. దీనిపై వైద్యశాఖ అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకున్నామని.. చెప్పడంతో ఇక ఎన్నికలు ఆగవని తేలిపోయింది. సిబ్బంది, బందోబస్తు కావలసినంత మేరకు ఉన్నట్లు కూడా నిర్ధారించే నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో ఇప్పుడు విపక్షాలకు చేసేదేమీ లేకుండా పోయింది.