అధికార లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబం

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో కాకుండా కుటుంబపరంగానే జరిగాయి. తమ తండ్రి అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన అధికార లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికుండగా తమపైన, తండ్రిపైన తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం ఇపుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

బహుశా అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు చేయటాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించటం వెనుక చంద్రబాబునాయుడు అండ్ కో నిర్ణయం ఉందేమో తెలీదు. ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించటమా ? తిరస్కరించటమా ? అన్నది పూర్తిగా కుటుంబ సభ్యుల ఇష్టమే. కానీ కోడెలపైన కానీ కుటుంబ సభ్యులపైన కానీ ప్రభుత్వం ఎక్కడా తప్పుడు కేసులు పెట్టలేదు.

ఐదేళ్ళ కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడింది కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మే. తమ పిల్లలు అరాచకాలకు పాల్పడుతున్నట్లు స్వయంగా టిడిపి నేతలే  మొత్తుకున్నా కోడెల పట్టించుకోలేదు. అంటే పిల్లలపై కోడెలకున్న  దృతరాష్ట్ర ప్రేమ చివరకు ఆయన ఉసురే తీసుకున్నది.

అదే సమయంలో పార్టీలో చంద్రబాబు నుండి ఎదురైన నిరాధరణ, నేతలు తనతో మాట్లాడకుండా దూరంగా జరగటం లాంట వాటితో మనస్ధాపానికి గురవ్వటంతోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారన్నది నిజం. వాస్తవాలు మరుగుపరిచి బురద చల్లటమే చంద్రబాబు పనికాబట్టి చంద్రబాబు రాజకీయం ఇలాగే సాగుతోంది.